ప్రజాప్రతినిధులపై అనర్హత అంశం బ్లాక్ప్ తయారైందని.. 'నోటా' నిష్ప్రయోజనంగా మారిందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. 'భారత రాజ్యాంగం-జవాబుదారీతనం'పై విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పబ్లిక్ లెక్చర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
విశ్రాంత ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేశ్కుమార్, విశ్రాంత ఏజీ సీతారామమూర్తి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ “పార్టీ ఫిరాయింపులను రాజ్యాంగం సమ్మతించదు.
ప్రజాప్రతినిధుల అనర్హతపై 3 నెలలు లేదా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్లు నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో 45 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి”అని అన్నారు.