తాజాగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సేవల్లో అనేక అంతరాయాలు కనిపిస్తున్నాయి. దోహా bound విమానం 8 గంటల ఆలస్యం కావడం అలాగే త్రివేంద్రం నుండి దుబాయ్, అబూధాబికి వెళ్లాల్సిన రెండు విమానాలు ఆపరేషన్ కారణాల వల్ల రద్దు కావడం ఈ సమస్యల తీవ్రతను చూపిస్తోంది. సంస్థ వెబ్‌సైట్ ప్రకారం, 539 (దుబాయ్) మరియు 537 (అబూధాబి) అనే విమానాలు రద్దు చేయబడ్డాయి. దోహా విమానం మామూలుగా ఉదయం 10:45కి దిగాల్సినదిగా ఉండగా, ఇప్పుడు అది సాయంత్రం 6:40కి మాత్రమే దిగుతుందని తెలియజేసింది.
ఇది కాకుండా హైదరాబాద్ నుండి పుకెట్‌కి వెళ్లే 110 విమానం బయలుదేరిన 16 నిమిషాల్లోనే సాంకేతిక లోపం కారణంగా తిరిగి రావాల్సి వచ్చింది. జూలై 19న ఇదే మార్గంలో మరో సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. తాజా ప్రమాదం తరువాత వారం రోజుల్లో 80కి పైగా ఎయిర్ ఇండియా విమానాలు రద్దు అయ్యాయి. ప్రయాణికులు విమానాల్లో సాంకేతిక లోపాలు, చివరి నిమిషంలో వచ్చే రద్దులు, సిబ్బంది నుంచి స్పష్టమైన సమాచార లేని పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యల వల్ల ఎయిర్ ఇండియా సేవలపై ప్రజలలో భద్రతపై మరియు నమ్మకంపై సందేహాలు కలుగుతున్నాయి.