చారడేసి కళ్లు... కోలాటమాడే కనురెప్పలు అనగానే భానుప్రియ టక్కున గుర్తుకువస్తారు. వెండితెరపై ఆమె కళ్లు చేసిన కవాతు... చూపులు చేసిన విన్యాసాలను మరిచిపోయిన ప్రేక్షకులు లేరు.
ఇంకా చదవండి: మాల్దీవుల్లో డాలీ చాయ్‌వాలాను కలిసి టీ తాగిన బిల్‌గేట్స్!! క్రేజ్ మామూలుగా లేదుగా!..
1980లలో ఒక వెలుగు వెలిగిన భానుప్రియ, ప్రస్తుతం తన స్థాయికి తగిన కేరక్టర్ రోల్స్ చేస్తూ వెళుతున్నారు. ఐడ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… "బాపు గారు అంటే నాకు చాలా ఇష్టం... తన సినిమాల్లో ఆయన హీరోయిన్ ను చూపించే స్టైల్ నాకు బాగా నచ్చుతుంది. హీరోయిన్ కళ్లకు ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. అందువలన ఆయన నుంచి నాకు పిలుపు వస్తుందని నేను ఎదురు చూశాను. కానీ ఆయన నుంచి నాకు అవకాశం రాలేదు. ఆయనను నేను కలవలేకపోయాను కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనతో సినిమా రాసిపెట్టి లేదంతే" అని అన్నారు. "ఇక విశ్వనాథ్ గారి విషయానికి వస్తే... షూటింగులో బాగా చేస్తే 'చాలా బాగా వచ్చింది' అని భుజం తట్టి అభినందించేవారు. వెంకటేశ్ గారు డాన్స్ విషయంలో మా అత్తమ్మ దగ్గర స్టూడెంట్. అప్పట్లో ఆయన ఎక్కువగా మాట్లాడేవారు కాదు... చాలా రిజర్వ్డ్ గా ఉండేవారు. తెరపై మా కాంబినేషన్ కి మంచి పేరు వచ్చింది" అని చెప్పారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమెరికా: H-1B వీసా రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు! పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజు!
యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!
ఆస్ట్రేలియా: స్టూడెంట్ వీసాలు ఇకపై సులువు కాదు! కస్టపడాల్సిందే!
ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం
వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..
దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఉండే పండుగ హోలీ.. అ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరి!! లేకుంటే..
దర్శకుడుతో రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్!! సోషల్ మీడియాలో హల్ చల్..
ఆదివారం ఇలాంటి పనులు చేస్తున్నారా? అయితే దరిద్రాన్ని మీరే స్వాగతిస్తున్నట్లు!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: