నిజం గెలవాలి యాత్రలో భాగంగా వైయస్ఆర్ జిల్లాలోని పలు మండలాల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి శుక్రవారం పర్యటించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపంతో మరణించిన వారి చిత్రపటాల వద్ద నివాళులర్పిస్తూ కుటుంబసభ్యులను పరామర్శించారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బి. కోడూరు మండలం గుంతపల్లిలో తెదేపా కార్యకర్త ఓబుల్ కలసపాడు మండలం లింగారెడ్డిపల్లిలో సగిలి డేవిడ్, బ్రాహ్మణపల్లెలో నల్లగుండ్ల వెంకటయ్య, తెల్లపాడులో బసిరెడ్డి చెంచురెడ్డి ఇళ్లకు వెళ్లి కుటుంబీకులకు ఓదార్చారు. భవిష్యత్తులో పార్టీతోపాటు ఎన్టీఆర్ ట్రస్టు అండగా ఉంటుందంటూ భరోసానిస్తూ ఆ మేరకు పత్రాలనూ ఇచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే తమ ఖాతాకు ఎన్టీఆర్ ట్రస్టు నుంచి ఆర్థికసాయం జమయిందని బాధితులు భువనేశ్వరికి తెలియచేసారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
నారా భువనేశ్వరి మాట్లాడుతూ మాఫియా ముఠాలను వైసీపీ పెంచి పోషిస్తోంది... గంజాయి, డ్రగ్ సరఫరాలో ఏపీది అగ్రస్థానం... ఏపీలో జోరుగా భూకబ్జాలతో పాటు ఇసుక, కల్తీ మద్యం, గంజాయి మాఫియాలు... ఇదేనా ఏపీలో వైసీపీ అభివృద్ధి మంత్రం అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్!! హైకోర్టు వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే!!
ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు!! నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసమే.. జయప్రకాష్ నారాయణ
ఆంధ్ర పోలీసులపై చర్యలకు సిద్ధమవుతున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్? ఫిర్యాదుల విలువ!
ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!
సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి