వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతి, రాష్ట్ర విధ్వంసంపై ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్షాలు ప్రజలు మీడియా దాడి పెంచాయి.
1570 రోజులుగా జరుగుతున్న అమరావతి ఉద్యమానికి ఊపిరి పోసేలా రాజధాని ఫైల్స్ పేరుతో వచ్చిన సినిమా ఈయన గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది.
వారం రోజుల క్రితం ఈయన వీరుడు వీరుడు సూర్యుడు అంటూ కోట్లాది రూపాయల వ్యయంతో తీసిన యాత్ర 2 సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
వైసిపి నాయకులు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ఒక్కొక్కరు 50 మందిని యాత్ర టు సినిమాకి తీసుకువెళ్లాలంటూ ప్రభుత్వం జారీ చేసింది.
మరిన్ని ఆసక్తికర ఎక్స్ క్లూజివ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రాజధాని పైల్స్ సినిమాకి ప్రజలు స్వచ్ఛందంగా టిక్కెట్లు కొనుక్కుని సినిమాకి వెళితే సినిమా పడిన 10 నిమిషాలలో పోలీస్ రెవెన్యూ అధికారులు హుటా హుట్టిన సినిమాలు నిలిపివేశారు.
రాష్ట్ర రాజధాని విషయంలో ఈయన ప్రభుత్వం వేసిన కుప్పిగంతులను రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా తీసిన సినిమా రాజధాని పైల్స్.
ఈయన తనకున్న అధికారం డబ్బుతో జాతీయ మీడియా, రాష్ట్రీయ మీడియాలో కూడా అమరావతి రాజధాని అంశాన్ని తప్పుదోవ పట్టించారు.
అమరావతి రాజధాని కొంతకాలం కులానికి ఆపాదించారు.
మరికొంత కాలం రాజధానిలో భారీగా అవినీతి జరిగిందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించారు.
మాచర్లలో ఆటవిక రాజ్యం!! మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్ తో తొక్కించి చంపేస్తారా? - నారా లోకేష్
రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయడం ద్వారా మూడు ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందంటూ అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఐదేళ్లు నెట్టుకొచ్చారు.
నేడు రాజధాని నిర్మించే శక్తి సామర్థ్యం తమకు లేదంటూ కోల్పోయిన హైదరాబాదునే రాజధానిగా కొనసాగించాలన్నది వైసిపి ప్రభుత్వం ఉద్దేశంగా ప్రకటించారు.
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించిన అక్రమ సంపాదనతో ప్రజలను మాయమాటలతో మోసగించే అధికారం చేపట్టిన ఈయనకి ప్రజా ఆమోదయోగ్యమైన పాలన చేయడం చేతకాలేదు.
ఈయన పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు.
వైసిపి పేటీఎం బ్యాచ్ ద్వారా అమరావతి లేకపోయినా నవరత్నాలు ఆగలేదు కదా అంటూ ఒక కొత్త దుష్ప్రచారానికి తెరలేపారు.
ఒక చెల్లి రాజకీయ పోరాటం!! మరో చెల్లి న్యాయపోరాటం!! తల్లి మౌన పోరాటం!!
ఇండియాలోనే పేరుందిన యూనివర్సిటీలలో ఒకటైన విట్ యూనివర్సిటీ అమరావతి ప్రాంతంలో దినదినాభివృద్ధి చెందుతుంది.
ఆ యూనివర్సిటీ కి విద్యార్థులు వెళ్లేందుకు రోడ్డు కూడా లేకుండా రాత్రికి రాత్రి తవ్వించి తరలించిన ఘనత ఈయన కే దక్కుతుంది.
అమరావతి రాజధాని చుట్టూ షెడ్యూల్డ్ కులాలకు చెందిన నియోజకవర్గాలు ఉన్న అమరావతి కమరావతి అంటూ ప్రజలలో విష బీజాలు నాటి అమరావతి విధ్వంసానికి పూనుకున్నారు.
ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజధానిగా నిర్మితం కాబోయే అమరావతిని ఆదిలోనే తుంచి రాష్ట్రంపై తనకున్న పగ ప్రతీకారాన్ని ఈయన ప్రదర్శించారు.
అధికారం చేపట్టిన వెంటనే ఈయన ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదిక కూల్చివేతతో అమరావతి విధ్వంసానికి పునాది వేశారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం భూములను త్యాగం చేసిన రైతులు గుండెలు ఆగిన ఈయన ఫ్యాక్షన్ గుండె కరగలేదు.
మహిళలపై దయాధులే కాదు ఏ ప్రభుత్వం చేయనన్ని ఆకృత్యాలను ప్రభుత్వమే పోలీసులతో చేయించిందంటే ఈయన క్రూరత్వం అర్థం చేసుకోవచ్చు.
రాజధాని అభివృద్ధి చెందుతే లక్షలాది మంది ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికే పరిస్థితి పూర్తిగా ఈయన నిర్వీర్యం చేశారు.
రాజధాని అభివృద్ధి చేయకపోవడంతో రాష్ట్రంలోని యువత ఉద్యోగ అవకాశాల కొరకు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారు.
నిర్మాణరంగం పూర్తిగా కుదేలు కావడంతో రోజువారి కూలీలు కూడా పక్క రాష్ట్రాలలో ఉపాధి కొరకు తరలిపోతున్నారు.
వైసిపి నాయకుడి పిట్టలదొర వాగ్దానాలు! లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడి!
రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా కేవలం విద్యార్థులు, వృద్ధులు మాత్రమే మనకు దర్శనమిస్తున్నారు అంటే ఈయన పాలన అర్థం చేసుకోవచ్చు.
ఈయన విధ్వంసకర పాలనతో రాష్ట్రం భవిష్యత్తు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా మారడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు.
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రజల గొంతుకలు కూడా ఒక్కొక్కటి లేస్తున్నాయి.
నిన్నటి వరకు రాష్ట్రంలో ప్రజల ప్రాథమిక హక్కులు కూడా కోల్పోయి జీవచ్ఛవాల బతుకుతున్నారు.
ఇక రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రేపు మాకు నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు ఈయన ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా రోడ్డు ఎక్కుతున్నారు.
ఇవి కూడా చదవండి:
దేశంలో నే అత్యంత ఖరీదైన ప్రభుత్వ సలహాదారులు! రాష్ట్ర ఖజానా దోపిడి! అధికారులు వారికి జీ హుజూర్
ఏఐ(AI)తో ఉద్యోగాలకు ముప్పు లేనట్లే! ఎంఐటీ తాజా అధ్యయనం...
చంద్రబాబు రాష్ట్రానికి, దేశానికి "తరగని హిమ శిఖరం" అంత! మీరే మాకు కావాలి!
సౌదీ: గుడ్ న్యూస్! మూడు సంవత్సరాల బ్యాన్ ఎత్తివేసిన ప్రభుత్వం! వేల ఉద్యోగ అవకాశాలు
లోకేష్ ను తట్టుకునే శక్తి లేదన్నసర్వేలు!! రాత్రికి రాత్రి మంగళగిరి తెరమీదకు లావణ్య!! ఎవరీవిడ??
వైసీపీ కోసం పని చేయాలంటూ వలంటీర్ల పై నరసరావుపేట ఎమ్మెల్యే ఒత్తిడి!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి