Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? Modi ji: మోదీ జీ మీ స్కిన్‌కేర్ రహస్యం ఏంటి.. హర్లీన్ ప్రశ్నకు స్నేహ్ రాణా స్మార్ట్ సమాధానం! Team meets President: రాష్ట్రపతిని కలిసిన WWC విజేత భారత మహిళల జట్టు.. భారత గర్వం మీరు అంటూ ముర్ము ప్రశంస! World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం! Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల! Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..! Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!! Google: గూగుల్‌లో ఇవి వెతికితే జైలు శిక్ష తప్పదు..! చట్టపరంగా నిషేధిత సెర్చ్‌లు ఇవే..! Mangalagiri: రేపు మంగళగిరి టిడిపి కార్యాలయంలో సీఎం చంద్రబాబు అందుబాటులో – కార్యకర్తలు, ప్రజలు నేరుగా వినతులను సమర్పించగలరు! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? Modi ji: మోదీ జీ మీ స్కిన్‌కేర్ రహస్యం ఏంటి.. హర్లీన్ ప్రశ్నకు స్నేహ్ రాణా స్మార్ట్ సమాధానం! Team meets President: రాష్ట్రపతిని కలిసిన WWC విజేత భారత మహిళల జట్టు.. భారత గర్వం మీరు అంటూ ముర్ము ప్రశంస! World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం! Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల! Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..! Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!! Google: గూగుల్‌లో ఇవి వెతికితే జైలు శిక్ష తప్పదు..! చట్టపరంగా నిషేధిత సెర్చ్‌లు ఇవే..!

ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలు తిప్పలు!! మక్కెలు విరగ్గొడతాం!! 'జెండా' సభలోపవన్ కల్యాణ్

2024-02-29 04:46:00

తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం : సిద్ధం అంటున్న జగన్ కు యుద్ధం ఇద్దాం... అన్ని వర్గాలను జగన్ మోసం చేశారు... పర్వతం ఎవరికీ వంగి సలాం చేయదు... గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంది... మన విజయానికి స్ఫూర్తి జెండా... అందుకే జెండా పేరుతో సభ... ఏపీ రోడ్లపై వెళ్లాలంటే రోజులు గడిచిపోయే పరిస్థితి. నడమంత్రపు సిరి వెనక ఒక నేరం ఉంటుంది... పడుతున్నారు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వైసీపీ గూండాయిజానికి కార్యకర్తలు భయపడవద్దు... మా సభలు, నాయకులపై వైసీపీ గూండాలు దాడి చేస్తే మక్కెలు విరగ్గొడతాం... రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఐదుగురు రెడ్లే పంచాయితీ చేస్తున్నారు... తాను ఒక్కడినే అంటున్న జగన్... మా ఒక్క ఎమ్మెల్యేను లాక్కున్నారు... నా నిర్ణయాలు పార్టీ, వ్యక్తి పరంగా ఉండవు... రాష్ట్ర లబ్ధి కోసమే ఉంటాయి... ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం రాజకీయాలు చేశాం.  ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమే పొత్తులు పెట్టుకున్నాం... టీడీపీ-జనసేన సహకరించుకుంటేనే ప్రజల భవిష్యత్తు బాగుంటుంది. జూబ్లీహిల్స్ ఫాంహౌస్ లో ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి జగన్ బతుకు నాకు తెలుసు జగన్...

బాపట్ల: ఎమ్మెల్యే కోనపై టీడీపీ నేత నరేంద్ర వర్మ ఆగ్రహం! కోన రఘుపతి ప్రజాధనాన్ని భారీగా..

ఇప్పటి వరకు పవన్ తాలూకా శాంతినే చూశావు జగన్... ఇకపై నా యుద్ధం ఏంటో చూస్తావు... మిగతా పార్టీలకు నేను నిలబడకపోతే జనసైనికుల కోసం ఎవరూ రారు... అందు కోసమే కూటమిని నేనే ప్రతిపాదించా... 4 దశాబ్దాల రాజకీయ ఉద్ధండుడిని జైలులో పెడితే బాధ వేసింది.... 25 కిలోల బియ్యం ఇచ్చేందుకు కాదు... 25 ఏళ్ల భవిష్యత్తు ఇచ్చేందుకు నేను ఉన్నా... చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం... ప్రజల భవిష్యత్తు కోసం రోడ్లపైకి వచ్చాను... రెండు చోట్ల ఓడిపోయాననే నిరాశ నాలో ఉంది... కోట్లు సంపాదించే స్కిల్స్ ఉన్నా అన్నీ కాదనుకుని వచ్చా...

టీడీపీ-జనసేన జెండా సభకు భారీ స్పందన! 7 లక్షల మంది హాజరు..

గూండా ఎమ్మెల్యేలకు ఎలాంటి కండక్ట్ సర్టిఫికెట్లు అక్కర్లేదు...  యువత ఉద్యోగాల కోసం మాత్రం కండక్ట్ సర్టిఫికెట్లు కావాలి... మన కండక్ట్ ఇచ్చే నాయకులు... మన కంటే ఉన్నతంగా ఉండాలి...  జగన్ ఇచ్చేది చేయూత కాదు... చేతివాత.... పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లు తీసుకున్న... 24 సీట్లేనా అని అవతలి పక్షం విమర్శించింది.బలి చక్రవర్తి కూడా వామనున్ని చూసి ఇంతేనా అన్నారు... నెత్తిన కాలుపెట్టి తొక్కితే ఎంతో అని తెలిసింది... జగన్ ను అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కాదు!! కార్యకర్తలారా వ్యూహం నాకు వదలండి... నన్ను నమ్మండి... గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలే...

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

అంకెలు లెక్కపెట్టవద్దని విపక్షాలకు చెప్పిండి... ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కడుతున్నా... కోట కూడా కడతాం... జగన్ తాడేపల్లి కోట కూడా బద్దలు కొడతాం... సలహాలు ఇచ్చేవాళ్లు అక్కర్లేదు.. యుద్ధం చేసేవాళ్లు కావాలి... యుద్ధం చేస్తేనే జగన్ కూలిపోతారు... ఓట్లు తీసుకువచ్చేందుకు జనసైనికులు సిద్ధంగా ఉన్నారు...  ప్రజల నాడి తెలియకుండా దశాబ్దం పాటు పార్టీని నడపగలమా?  దోపిడీలు చేసినా జగన్ ను వెనుకేసుకుని వస్తున్నారు... ఏమీ చేయకున్నా జగన్ ను పొగిడే సమూహం ఆయనకు ఉంది. నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తోంది? నన్ను ప్రశ్నించే వాళ్లు నాతో నిలబడడం నేర్చుకోండి. నేను ఒక ప్రాంత వ్యక్తిని కాదు.. ఓడినా, గెలిచినా మీతో ఉంటా.

ఎన్టీఆర్ విప్లవాత్మక పథకాలు తీసుకువచ్చారు! టీడీపీకి ఉన్న బలం..

కార్యకర్తలారా నా వ్యూహాలను తప్పుపట్టవద్దు... పవన్ అంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు... పవన్ అంటే దేశ యువత కన్నీళ్లు తుడిచే చెయ్యి... పవన్ అంటే ఆడబిడ్డలకు రక్షణగా ఉండే రాఖీ... పవన్ అంటే జగన్ ను నట్టేట ముంచే తుపాను... పవన్ అంటే జగన్ అధఃపాతాళానికి తొక్కే వామనుడి పాదం... ఒక్కడి ప్రతిఘటన కోట్ల మందికి తిరగబడే ధైర్యం ఇస్తుంది... వైసీపీ దుష్ట పాలనపై ప్రజలు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు...  మినీ యుద్ధాలన్నీ కలిసి మహా యుద్ధాన్ని ప్రకటిస్తున్నా...  మహా యుద్ధానికి శంఖారావం పలుకుతున్నా... వైసీపీ విధ్వంస పాలన ఆపి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం.  ప్రజలకు బంగారు భవిష్యత్తు ఇచ్చే బాధ్యత టీడీపీ-జనసేన తీసుకుంటుంది. వైసీపీ పోవాలి.. టీడీపీ-జనసేన కూటమి రావాలి... టీడీపీ-జనసేన గెలుస్తుంది... ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు!! బొమ్మసానిని కలిసిన వసంత!!

అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం!!

ఉమ్మడి సభ పేరు తోనే వణుకుతున్న తాడేపల్లి ప్యాలస్!!దెబ్బ మీద దెబ్బ !! వాటిని సీజ్ చేయండి అంటూ హైకోర్టు కీలక ఆదేశం!!

నెల్లూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చిన డిప్యూటీ మేయర్ !!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →