ఫ్యామిలీ కోసం బడ్జెట్ ధరలో మంచి కారు కోసం చూస్తుంటారు. అలాంటి వారికి ముందుగా గుర్తొచ్చే కంపెనీ టాటా మోటార్స్. ఈ కంపెనీ నుంచి చాలా మోడళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మంచి బడ్జెట్ ధరలో టాటా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఫిబ్రవరి నెలలో మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన మోడళ్లలో భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. వీటిలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్ వంటివి కలిసి ఉంటాయి. ఈ డిస్కౌంట్ ఆఫర్ 2024, ఫిబ్రవరి చివరి వరకు మాత్రమే ఉంటుంది.
టాటా టియాగో ఈ కారు 2023 మోడల్ పై రూ.75 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది టాటా మోటార్స్. ఇందులో రూ. 60 వేల క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే రూ. 15 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ లేదా స్క్రాపేజ్ బోనస్ లభిస్తుంది. అయితే, టియాగో 2024 మోడళ్లపై రూ.40 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.30 వేలు కాగా... రూ.10 వేల ఎక్స్చేంజీ బోనస్ లభిస్తోంది. అలాగే టియాగో సీఎన్‌జీ 2023 వేరియంట్ పై రూ. 75 వేలు, 2024 యూనిట్లపై రూ. 25 వేల వరకు ప్రయోజనాలు కల్పిస్తోంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
టాటా హారియర్... ఈ కారు టాప్ స్పెక్ ఎడాస్ ఎక్విప్డ్ వేరియంట్ పై రూ. 75 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ తో పాటు రూ. 50 వేల వరకు ఎక్స్చేంజీ బోనస్ లభిస్తోంది. నాన్ అడాస్ వేరియంట్లపై రూ. 75 వేల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.
టాటా ఆల్ట్రోజ్ .. ఈ కారు హ్యాచ్ బ్యాక్ పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వేరియంట్లపై రూ. 45 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. 2024 ఎడిషన్లపై రూ. 15 వేల వరకు మాత్రమే తగ్గింపు లభిస్తోంది. అన్ని వేరియంట్లపై రూ. 10 వేల వరకు ఎక్స్చేంజీ బోనస్ లభిస్తుంది. టాటా టిగోర్ (Tata Tigor)... ఈ కారు 2023 మోడల్ పై రూ.75 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుండగా... 2024 వేరియంట్లపై రూ. 40 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు కల్పిస్తోంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పార్వతీపురం శంఖారావం సభలో లోకేశ్ ప్రసంగం.. ఎవరినీ వదిలిపెట్టేది లేదు పరదాలు కట్టిచ్చి తిప్పిస్తా
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి