ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు వైద్యారోగ్య శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈమేరకు సోమవారం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలోని ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. బ్యాక్ లాగ్ తో పాటు రెగ్యులర్ పోస్టుల నియామకం చేపడుతున్నట్లు వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులను పీహెచ్ సీలతో పాటు ఇతర వైద్య సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన నియమించనున్నట్లు తెలిపింది.
ఇంకా చదవండి: టీడీపీలోకి వైసీపీ కీలక నేత..? చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా!
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు బుదవారం (ఈ నెల 4) నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. దరఖాస్తులకు చివరి గడువు ఈ నెల 13 అని తెలిపింది. పోస్టులకు సంబంధించిన అర్హతలు, ఎంపికైన తర్వాత చెల్లించే జీతభత్యాలు ఇతరత్రా పూర్తి వివరాల కోసం వైద్యారోగ్య శాఖ అధికారిక వెబ్ సైట్ సందర్శించాలని సూచించింది.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!
నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్! విశాఖ వస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. నెక్ట్స్ ఎవరు?
ఏమిటి.. పరగడపున ఈ పళ్లు తింటే! రోజువారీ ఆహారంలో - సమస్యలు తెచ్చుకున్నట్టేనట!
విజయవాడ ట్రాఫిక్ సమస్యలకు టెక్నాలజీ తోడు! డ్రోన్లు, ఎస్ఈడీ బోర్డులతో పోలీసుల ముందడుగు!
బూడిద తరలింపు వివాదం.. ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్! ఎందుకు అంటే!
మందుబాబులకు కిక్కే కిక్కు.. భారీగా తగ్గిన మద్యం ధరలు! ఆ వివరాలు మీ కోసం..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: