సత్యసాయి జిల్లా సీకే పల్లి బీసీ హాస్టల్‌లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందలేదన్న ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎం జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. హాస్టల్ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయని వార్డెన్, సంబంధిత ఉద్యోగుల తీరుపై సీఎం మండిపడ్డారు. తనకు విషయం తెలిసిన వెంటనే విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేసినట్లు సీఎంకు కలెక్టర్ వివరించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి, నిర్లక్ష్యం వహించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు హాస్టల్ వార్డెన్‌పై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. వార్డెన్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు మంత్రి సవిత కూడా ఈ అంశంపై స్పందించారు. కలెక్టర్, బీసీ సంక్షేమ శాఖాధికారులతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు.
ఇంకా చదవండి: తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు!
హాస్టల్‌లో మధ్యాహ్న భోజనం ఎందుకు సమకూర్చలేదని మంత్రి ఆరా తీశారు. హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణి సరికాదని మండిపడ్డారు. విద్యార్థులను ఆకలితో బాధపడేలా చేసిన సీకే పల్లి బీసీ బాలుర హాస్టల్ హెచ్‌డబ్ల్యూవో నారాయణ స్వామిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని కలెక్టర్‌ను మంత్రి సవిత ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో బీసీ సంక్షేమ శాఖాధికారులు హాస్టల్ విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించారు. అధికారులపై నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టళ్లలో చేర్పిస్తున్నారని, వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మంత్రి స్పష్టం చేశారు. హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, అవసరమైతే అటువంటి హెచ్‌డబ్ల్యూవోలను, ఇతర సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తామని మంత్రి సవిత హెచ్చరించారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
ఇంకా చదవండి: వైసీపీకి మరో షాక్.. సాక్షిపై పరువు నష్టం కేసు! నారా లోకేష్ కీలక నిర్ణయం..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
డ్వాక్రా మహిళల కోసం సర్కార్ భారీ ప్రణాళిక! లక్షల కుటుంబాలకు సోలార్ రూఫ్ టాప్ సౌకర్యం!
దిమ్మతిరిగే ఆఫర్.. రూ.15 వేల స్మార్ట్‌ఫోన్ ఎంత తక్కువకి వస్తుందో.. లక్కీ ఛాన్స్ గురు..
షాక్ షాక్ షాక్... జగన్ గూబగుయ్యుమనిపించిన నంబర్ టు, నంబర్ త్రీ! రాజకీయాల నుంచి అవుట్!
శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! ఫిబ్రవరి 1న కొత్త పథకం ప్రారంభం!
కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు.. ఆ వివరాలు మీకోసం!
మూడో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా! 62 వేల గ్రూపుల సలహాలు, సూచనలు..
విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! పార్టీ పరిస్థితి కూడా..
ఈ విషయంలో భారతీయుల గుండెల్లో గుబులు! అమెరికా వద్దంటే.. ఈ దేశాలు రారమ్మంటున్నాయ్.. ఆ వివరాలు..
రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త! వారి అకౌంట్లలోకి రూ.53 వేలు జమ!
ఎమ్మెల్యే పై టమాటాలు, గుడ్లు విసిరిన జనం.. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత!
ఢిల్లీ నుంచి విజయవాడ బయల్దేరిన చంద్రబాబు! 2025-26 కేంద్ర బడ్జెట్లో ఏపీకి..
ప్రభుత్వ పాఠశాలలో నా బర్త్ డే వేడుకలు.. లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు! బాధ్యులపై వెంటనే చర్యలు..
మంత్రికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లో ఒకదానికొకటి ఢీ కొన్న ఎనిమిది వాహనాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: