సాక్షి దినపత్రికపై దాఖలు చేసిన పరువునష్టం కేసులో మంత్రి నారా లోకేశ్ సోమవారం విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరుకానున్నారు. ఈ కేసులో ఇప్పటికే రెండు క్రాస్ ఎగ్జామినేషన్స్ పూర్తయ్యాయి. మూడోసారి జరుగుతున్న క్రాస్ ఎగ్జామినేషన్ కు మంత్రి హాజరవుతున్నారు. సాక్షి దినపత్రిక తరఫున మొత్తం ఐదుగురు లాయర్లు వాదిస్తుండగా, మొదటి న్యాయవాది ప్రస్తుతం క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఈ కేసులో మంత్రి లోకేశ్ తరపున గుంటూరు సీనియర్ న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు హాజరవుతున్నారు. 2019 అక్టోబర్ 22న `చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి` హెడ్డింగ్‌తో అసత్యాలు, కల్పితాలతో సాక్షి దినపత్రికలో ఓ కథనం ప్రచురించారు.
ఇంకా చదవండి: శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం! ఫిబ్రవరి 1న కొత్త పథకం ప్రారంభం!
ఈ కథనం పూర్తిగా అవాస్తవాలతో కూడినదని, ఉద్దేశపూర్వకంగా తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనే దీనిని ప్రచురించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. దీనిపై సాక్షి పత్రికకు రిజిస్టర్ నోటీసు పంపించినా ఎటువంటి వివరణ ఇవ్వకపోవడం, నోటీసులకు స్పందించకపోవడంతో నారా లోకేశ్ పరువునష్టం దావా వేశారు. ఆ కథనంలో పేర్కొన్న రోజులలో తాను విశాఖలోనే లేనని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ ఆహ్వానం మీద వచ్చే అతిథులకు చేసిన మర్యాదల ఖర్చును తనకు అంటగడుతూ తన ప్రతిష్టని మంటగలిపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. గతంలో మంత్రిగా తాను అనేకమార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్ పోర్ట్ లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు స్వీకరించలేదని లోకేశ్ స్పష్టం చేశారు.
ఇంకా చదవండి: షాక్ షాక్ షాక్... జగన్ గూబగుయ్యుమనిపించిన నంబర్ టు, నంబర్ త్రీ! రాజకీయాల నుంచి అవుట్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు.. ఆ వివరాలు మీకోసం!
మూడో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా! 62 వేల గ్రూపుల సలహాలు, సూచనలు..
విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! పార్టీ పరిస్థితి కూడా..
ఈ విషయంలో భారతీయుల గుండెల్లో గుబులు! అమెరికా వద్దంటే.. ఈ దేశాలు రారమ్మంటున్నాయ్.. ఆ వివరాలు..
రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త! వారి అకౌంట్లలోకి రూ.53 వేలు జమ!
ఎమ్మెల్యే పై టమాటాలు, గుడ్లు విసిరిన జనం.. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత!
ఢిల్లీ నుంచి విజయవాడ బయల్దేరిన చంద్రబాబు! 2025-26 కేంద్ర బడ్జెట్లో ఏపీకి..
ప్రభుత్వ పాఠశాలలో నా బర్త్ డే వేడుకలు.. లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు! బాధ్యులపై వెంటనే చర్యలు..
మంత్రికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్ లో ఒకదానికొకటి ఢీ కొన్న ఎనిమిది వాహనాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: