రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్ర ప్రజలు చుక్కలు చూపించారు. ఆ పార్టీని కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేస్తూ ఎవరూ ఊహించని తీర్పునిచ్చారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే వైసీపీలో ఏదో తెలియని అనిశ్చితి నెలకొంది. గ్రామాల్లో బూత్ లెవల్ కార్యకర్తల నుంచి జిల్లా నాయకులంతా వరుసగా పార్టీలు మారుతున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం టీడీపీ, జనసేన పార్టీల తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇవాళ ఆ పార్టీ కీలక నేత కనుమూరి రవిచంద్రారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మంత్రి సత్య కుమార్ యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం రవిచంద్రారెడ్డికి వారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. రూ.11500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం! ఇక వారికి పండగే పండగ!
2025 జనవరి మహీంద్రా కార్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!
మీకు ఈ 5 బ్యాంకుల్లో ఖాతా ఉందా? వెంటనే చెక్ చేసుకోండి!
ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్! ఆ బాటిల్‌పై భారీగా తగ్గింపు..
ఇంటి దగ్గరే ఈజీగా ఇలా చేయండి చాలు.. ఈ ఆహారాలతో - మీ కిడ్నీలు పూర్తిగా క్లీన్ అయిపోతాయి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: