వైసీపీ నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌ను అనంతపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన్ను ఆదివారం తెల్లవారుజామున అనంతపురం తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులను అసభ్యకరంగా విమర్శిస్తూ బోరుగడ్డ యూట్యూబ్ చానల్‌లో మాట్లాడారని తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజశ్విని నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ నిమిత్తం బోరుగడ్డను కస్టడీలోకి తీసుకున్నారు. రాజమండ్రి కోర్టు నుంచి మూడు రోజుల కస్టడీ కోరారు. శనివారం అతనికి వైద్య పరీక్షలు అక్కడే నిర్వహించారు. కాగా, బోరుగడ్డ విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన్ను తెల్లవారుజామున 1.20 గంటల సమయంలో పోలీసుస్టేషన్‌కు తీసుకురాగా.. అప్పటికే అక్కడి లైట్లన్నీ ఆర్పేశారు. వచ్చీ రాగానే అనిల్‌ను లోపలకు తీసుకెళ్లారు.
ఇంకా చదవండి: రాజకీయాలపై సినీనటి కస్తూరి కీలక వ్యాఖ్యలు! ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ!
ఆదివారం సైతం పోలీసుస్టేషన్‌కు తాళం వేశారు. విచారణలో అనిల్ పోలీసులకు సహకరించలేదని సమాచారం. ‘తెలియదు.. పెద్దగా గుర్తులేదు..’ అనే సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. ఆదివారం అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు సమక్షంలో విచారించారు. వీఆర్వోల ఎదుట స్టేట్‌మెంట్‌ను తీసుకున్నట్లు తెలిసింది. అనిల్ గతంలో మాట్లాడిన వీడియోల ఆధారంగా ‘నువ్వే కదా ఈ వీడియోలో మాట్లాడింది’ అని ప్రశ్నించినట్లు తెలిసింది. 3 రోజుల కస్టడీ తర్వాత అతనికి సోమవారం సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహించి, స్థానిక కోర్టులో హాజరుపరిచిన తర్వాత రాజమండ్రి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రయాణ సమయాన్ని చూపి మంగళవారం ఉదయం అక్కడి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు ఒక పెద్ద ఊరట కలిగించే విషయం.. సంవత్సరం పాటు ఉచిత! ప్రభుత్వం కీలక నిర్ణయం!
శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! ఇంక పండగే పండగ! ప్రత్యేక రైలు సర్వీసులు!
ఒరేయ్ మీ దుంపలు తెగ.. 102 ఏళ్ల మహిళను పెళ్లాడిన 100 ఏళ్ల పెళ్లికొడుకు! ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..
రైల్వే స్టేషన్‌లో కోతుల ఫైట్ వల్ల ఆగిపోయిన రైళ్లు! అసలు ఏం జరిగిందంటే!
అప్డేట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రిటర్న్ రాలేదా? అయితే ఇలా చేయండి! రాష్ట్రంలో ఏ ఇతర పథకాల్లో..
దారుణం.. తిరుమల కొండపై కారు దగ్ధం! ఆ సమయంలో కారులో...
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: