రాష్ట్రంలో మందుబాబులకు మరో బిగ్ షాక్ తగలనుంది. ఇప్పుడిప్పు్డే నాణ్యమైన మద్యం తక్కువ ధరకు దొరుకుతుండడంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో రానున్న రోజుల్లో వైన్స్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే? తాజాగా రాష్ట్రంలో కూటమి సర్కార్ నూతన మద్యం పాలసీని తీసుకువచ్చి వైన్ షాప్‌లను ప్రైవేట్ పరం చేసింది. దీంతో ప్రైవేట్ వ్యక్తులు మద్యాన్ని విక్రయిస్తున్నాయి. అయితే తాజాగా రాష్ట్రంలోని మద్యం షాపుల యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి మద్యం కొనుగోళ్లు నిలిపివేయాలని వారు భావిస్తున్నారు.
ఇంకా చదవండి: ముంచుకొస్తున్న మరో ముప్పు! ప్రాణాంతకంగా మారుతున్న బ్లీడింగ్ ఐ వైరస్!
రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులకు టెండర్ నిర్వహించే ముందు 20% కమీషన్ ఇస్తామని సర్కార్ వెల్లడించింది. అయితే అప్పుడు ప్రకటించిన కమిషన్ ఇవ్వాలని వైన్స్, బార్ల యజమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కడపలో సమావేశమైన మద్యం షాపుల ఓనర్లు ఈనెల 5న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్కు నోటీస్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈనెల 14వ తేదీలోపు కమీషన్ పెంపుపై నిర్ణయం తీసుకోకపోతే మద్యం కొనుగోళ్లు ఆపేస్తామని మద్యం షాపుల యజమానులు హెచ్చరించారు. ప్రస్తుతం 9.5% కమీషన్ ఇస్తున్నారని, దీనితో లైసెన్స్ ఫీజులు కట్టలేమని వాపోతున్నారు. వారు మద్యం కొనుగోళ్లు నిలిపివేస్తే.. రాష్ట్రంలో వైన్స్ బంద్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో పాటుగా బార్ల నిర్వహణలో చిన్నచిన్న ఉల్లంఘనలకుగాను పెద్ద మొత్తంలో జరిమానాలు విధించడం వ్యాపారులకు భారంగా మారిందని వారు తెలిపారు. జరిమానాలను తగ్గించాలని కూడా వారు ప్రభుత్వం ఎదుట వినతి పెట్టారు. ఈ అంశంపైనా నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చారు.
ఇంకా చదవండి: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ రిలీజ్! పూర్తి వివరాలు మీకోసం!
ప్రస్తుతం ఉన్న 10 శాతం మార్జిన్ వల్ల వారు నష్టాల్లోకి వెళ్లే అవకాశముందని, దీనిని తక్షణమే సరిచేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్‌కుమార్‌కు, మార్జిన్ పెంపు విషయమై నివేదిక సమర్పించాలని ముకేశ్‌కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, మద్యం అమ్మకాల విషయంలో క్రమశిక్షణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయం చేసినా, బెల్ట్ షాపుల్లో అమ్మకాలు జరిగినా, కఠినమైన జరిమానాలు విధిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలిసారి ఉల్లంఘన చేస్తే రూ.5 లక్షలు జరిమానా. రెండోసారి దొరికితే లైసెన్సు రద్దు. ఈ నిబంధనల అమలుకు సంబంధించి ముకేశ్‌కుమార్ మీనా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!
చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!
టీడీపీలోకి వైసీపీ కీలక నేత..? చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా!
ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: