ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని (కాళీకృష్ణ శ్రీనివాస్) టీడీపీలో చేరనున్నారని సమాచారం. దీనికోసం ఇప్పటికే అంతా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈరోజు సచివాలయంలో జరిగే కేబినెట్ మీటింగ్ తర్వాత సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. ఇక గత ఎన్నికల్లో ఆళ్ల నాని ఏలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆళ్ల నాని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన జనసేనలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, చివరికి టీడీపీ వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. నాని మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాగా, నాని టీడీపీలో చేరేందుకు విజయనగరం జిల్లాకు చెందిన ఓ కీలక నేత టీడీపీ పెద్దలతో మంతనాలు జరిపి ఒప్పించినట్లు తెలుస్తోంది. అలాగే ఆళ్ల నాని బాటలోనే మరికొందరు వైఎస్సార్‌సీపీ నేతలు నడవబోతున్నట్లు తెలుస్తోంది.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు టీడీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ఓ మాజీ మంత్రి, మరో మాజీ ఎమ్మెల్యే కూడా వైఎస్సార్‌సీపీని వీడబోతున్నట్లు తెలుస్తోంది.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!
నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్! విశాఖ వస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. నెక్ట్స్ ఎవరు?
ఏమిటి.. పరగడపున ఈ పళ్లు తింటే! రోజువారీ ఆహారంలో - సమస్యలు తెచ్చుకున్నట్టేనట!
విజయవాడ ట్రాఫిక్ సమస్యలకు టెక్నాలజీ తోడు! డ్రోన్లు, ఎస్ఈడీ బోర్డులతో పోలీసుల ముందడుగు!
బూడిద తరలింపు వివాదం.. ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్! ఎందుకు అంటే!
మందుబాబులకు కిక్కే కిక్కు.. భారీగా తగ్గిన మద్యం ధరలు! ఆ వివరాలు మీ కోసం..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: