ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారని ఆరు నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తాజాగా డిసెంబర్ 2 నుంచి అంటే నిన్న నుంచి ఏకంగా దరఖాస్తులే స్వీకరిస్తారనే ప్రచారం కూడా ముమ్మరంగా జరుగుతోంది. దీంతో జనం సచివాలయాలకు క్యూ కడుతున్నారు. గత ప్రభుత్వంలో సచివాలయాల నుంచే రేషన్ కార్డులు జారీ చేయడంతో ఈసారి కూడా అలాగే చేస్తారనే ప్రచారంతో వీరు సచివాలయాలకు వెళ్తున్నారు. వారికి అక్కడ షాకులు తప్పట్లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం కోటీ 48 లక్షల రేషన్ కార్డులున్నాయి. వీటిలో వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, రాజకీయ పార్టీల కార్యకర్తల చేతుల్లో ఉన్నాయి. వీటిని తొలగించకుండా కొత్త కార్డులు జారీ చేస్తే సమస్యలు తప్పవు. దీంతో కొత్త కార్టీల జారీకి ప్రభుత్వం ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది. ఆలోపు రాష్ట్రంలో కొత్త కార్డుల జారీపై పుకార్లు మొదలయ్యాయి. ఇవి కాస్తా పరాకాష్టకు చేరాయి. వాస్తవానికి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుండి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడ లేదు.
ఇంకా చదవండి: విశాఖ-విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! రవాణా వ్యవస్థలో కొత్త అధ్యాయం!
అలాగే డిసెంబర్ 2నుండి దరఖాస్తుల స్వీకరణ అంటూ జరుగుతున్న ప్రచారం కూడా ఒట్టిదేనని తేలిపోయింది. ఇదే అంశంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేషీని సంప్రదిస్తే తాము ఇప్పటివరకూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పేసారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ రేషన్ కార్డుల జారీకి ఎటువంటి ఆప్షన్ కూడా ఇవ్వలేదన్నారు. కాబట్టి ప్రజలు ఊహాగానాలు నమ్మెద్దని సూచిస్తున్నారు. త్వరలో పాత రేషన్ కార్డులు తొలగించి వారి స్థానంలో కొత్త కార్డులు ఏర్పాటు చేసిన తరువాత దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేస్తారని ప్రభుత్వం చెబుతోంది. జనవరి నుంచి మార్చి లోపు ఈ ప్రక్రియ ఉండొచ్చని చెప్తున్నారు. కానీ ఇప్పటికే జరుగుతున్న ప్రచారంలో పలు చోట్ల సచివాలయాల చుట్టూ జనం తిరుగుతూనే ఉన్నారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్! విశాఖ వస్తున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. నెక్ట్స్ ఎవరు?
ఏమిటి.. పరగడపున ఈ పళ్లు తింటే! రోజువారీ ఆహారంలో - సమస్యలు తెచ్చుకున్నట్టేనట!
విజయవాడ ట్రాఫిక్ సమస్యలకు టెక్నాలజీ తోడు! డ్రోన్లు, ఎస్ఈడీ బోర్డులతో పోలీసుల ముందడుగు!
బూడిద తరలింపు వివాదం.. ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్! ఎందుకు అంటే!
మందుబాబులకు కిక్కే కిక్కు.. భారీగా తగ్గిన మద్యం ధరలు! ఆ వివరాలు మీ కోసం..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: