సంక్షేమ పథకాల అమలు, పౌర సేవలపై ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటిని మెరుగుపరచడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పథకాల్లో ఉన్న లోటుపాట్లను సరిదిద్దేందుకు ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) విధానాన్ని ఉపయోగించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలు, సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా మరింత మెరుగైన సేవలను అందించవచ్చని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ చర్యతో పథకాల ప్రభావం, ప్రజలకు అందుతున్న ఉపయోగం, అలాగే ప్రజల అవసరాలు గురించి స్పష్టమైన అవగాహన కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయం సేకరణ చేయాలని నిర్ణయించారు. పథకాల అమలులో ఉన్న లోటుపాట్లను గుర్తించేందుకు, వాటిని సరిదిద్దేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఇంకా చదవండి: రోజా నోరు మూపించిన షర్మిల.. ఘాటు కౌంటర్! స్క్రిప్ట్ మీదేనా, ఆయనదా? లేక ఉన్నది లేనిది చెప్పే సాక్షిదా?

ప్రజలు ఇచ్చే రేటింగ్ ఆధారంగా పథకాలపై మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏ అంశంలోనైనా ప్రజల అభిప్రాయాలే కీలకమని, వాటిని పరిగణలోకి తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలను ప్రారంభించింది. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే?


ప్రస్తుతం అమలవుతున్న ఈ పథకాల్లో ప్రజల అభిప్రాయాల ప్రకారం మార్పులు చేయడం ద్వారా సంక్షేమ పథకాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయని సర్కార్ యోచిస్తోంది. ప్రజల సూచనలు, అవసరాలు ప్రభుత్వం దృష్టికి చేరవేసేందుకు ఈ విధానం ఎంతగానో సహాయపడుతుంది. ప్రజలు ప్రభుత్వం అమలు చేసే పథకాలపై నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సంక్షేమాన్ని మరింత సమర్థంగా అమలు చేయగలమనే ఆశతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.

ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల మరో లిస్టు విడుదల?? పార్టీ శ్రేణుల్లో పెరిగిపోతున్న ఉత్కంఠ.. అసహనం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ కార్యకర్త ఆత్మహత్యపై లోకేశ్ భావోద్వేగ వ్యాఖ్యలు! కష్టాలను చెప్పుకోకపోవడం నా మనసును కలిచివేసింది!

బూడిద తరలింపు వివాదం.. ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్! ఎందుకు అంటే!

మందుబాబులకు కిక్కే కిక్కు.. భారీగా తగ్గిన మద్యం ధరలు! ఆ వివరాలు మీ కోసం..

2/12 TO 14/12 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

వైసీపీకి మరో షాక్.. కొడాలి నాని మెడకు ఉచ్చు - అనూహ్య ట్విస్ట్! కీలక అంశాలు వెలుగులోకి...

నాగచైతన్య పెళ్లికి నాగార్జున ఇస్తున్న బహుమతి ఏమిటో తెలుసా? దాదాపు ఎనిమిది గంటల సమయం!

వైసీపీకి షాక్.. రోజాపై పోలీసులకు ఫిర్యాదు! ఫొటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్!

ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్! కొత్త రేషన్ కార్డులు! దరఖాస్తులు ఎప్పటినుంచి అంటే?

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! శ్రీవారి ప్రత్యేక దర్శనం, గోల్డెన్ ఛాన్స్! టోకెన్లు ఇలా...

ఏపీ మహిళల అకౌంట్లలో రూ.1,500... ఇది మీరు గమనించారా? అలా అస్సలు చేయవద్దు - ప్రభుత్వం కీలక అప్డేట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group