ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తానన్న ఫించన్ పెంపు & ఇంటింటికీ పింఛన్ల పంపిణీ విధానం అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం వితంతు ఫించన్ల పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వితంతు పింఛను పై ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది. వృద్ధాప్య పింఛను తీసుకునే వారికి భర్త మరణిస్తే వెంటనే భార్యకు పింఛన్లు మంజూరయ్యేలా నిర్ణయించింది. భర్త ఒకటో తేదీ నుంచి 15 లోపు మరణిస్తే వెంటనే పింఛన్ ఇవ్వాలని, 15 నుంచి 30వ తేదీ లోపు చనిపోతే వచ్చే నెల నుంచి పింఛన్ అందజేయాలని స్పష్టం చేసింది. కుటుంబ పెద్ద మరణిస్తే ఆర్థికంగా నలిగిపోకూడదని, ఆసరాగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!

ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!

గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. లక్షలు! నెలకు ఎంత కట్టాలంటేఅసలు విషయం ఇదే!

శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

పెన్షన్ దారులకు పండగే పండగ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు! కొన్ని కీలక మార్పులు - కచ్చితంగా తెలుసుకోవాల్సిందే! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group