బయటి ఆహారం తినడం అంటే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఇండ్లలో చేసే ఆహారాల కన్నా కొందరు బయటి ఆహారాన్నే అమితంగా ఇష్టపడుతుంటారు. ఇప్పుడు నడుస్తున్నది జొమాటో, స్విగ్గీ యుగం కావడంతో చాలా మంది ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. నచ్చిన ఫుడ్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తింటున్నారు. అయితే అంతవరకు బాగానే ఉన్నప్పటికీ కొందరు మాత్రం ఎక్కువగా జంక్ ఫుడ్‌ను తింటున్నారు. ముఖ్యంగా బయట లభించే ఫాస్ట్ ఫుడ్‌ను అధికంగా తింటున్నారు. దీంతో అనారోగ్యాల బారిన పడుతున్నారు. అయితే కొన్ని రకాల ఆహారాలు ఫాస్ట్ ఫుడ్ అయినప్పటికీ అవి మనకు ఆరోగ్యకరమైనవే. ఇక అలాంటి ఆరోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రిల్డ్ చికెన్ శాండ్ విచ్..
గ్రిల్డ్ చికెన్ శాండ్‌విచ్ ను ఆరోగ్యకరమైన ఫాస్ట్‌ఫుడ్‌గా చెప్పవచ్చు. అయితే ఇందులో వైట్ బ్రెడ్‌కు బదులుగా బ్రౌన్ బ్రెడ్‌ను వాడాలి. అలాగే చికెన్‌ను వేయించకుండా గ్రిల్ చేయాలి. ఇలా తయారు చేసిన గ్రిల్డ్ చికెన్ శాండ్ విచ్ ఆరోగ్యానికి మంచిదే అని చెప్పవచ్చు. కనుక బయట మీరు ఎప్పుడైనా దీన్ని తింటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఓ వైపు రుచిగా ఉన్న ఆహారం తిన్న ఫీలింగ్ కలుగుతుంది. మరో వైపు శరీరానికి హాని కలగకుండా ఉంటుంది. ఇక బయట మీరు గ్రిల్ చికెన్ లేదా ఫిష్ తింటే అవి మనకు మేలు చేస్తాయి. కానీ వాటిపై అనవసరపు ఆయిల్స్, క్రీములు గట్రా వాడకుండా తినండి. అప్పుడే అవి ఆరోగ్యకరమైన ఫలితాలను ఇస్తాయి. అలాగే ఇలాంటి ఆహారాలను తిన్నప్పుడు ఎక్కువగా పచ్చి కూరగాయలు, ఆకుకూరలను తినడం మరిచిపోకండి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గ్రిల్డ్ చికెన్ రాప్స్..
బేకరీలు లేదా రెస్టారెంట్లలో చాలా మంది చికెన్ రాప్స్ తింటుంటారు. వాటిల్లో గ్రిల్డ్ చికెన్ రాప్స్ కూడా ఒకటి. అయితే వీటిల్లో సాస్ తక్కువగా వేసి ఉపయోగించాలి. ఇలా తయారు చేసిన గ్రిల్డ్ చికెన్ రాప్స్‌ను తినవచ్చు. ఇవి ఆరోగ్యానికి మంచివే. అలాగే గ్రిల్డ్ ఫిష్ టాకోస్‌ను కూడా తినవచ్చు. ఇవి కూడా ఆరోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్ కిందకు వస్తాయి. అయితే చీజ్, క్రీములు గట్రా వాడకుండా తినాలి. దీంతో ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది. అదేవిధంగా ఎగ్ వైట్ శాండ్ విచ్‌లను కూడా తినవచ్చు. వీటిల్లో కోడిగుడ్డులోని తెల్ల సొన ఉంటుంది. ఇక బ్రెడ్‌ను కూడా బ్రౌన్ బ్రెడ్‌ను ఉపయోగించాలి. ఇలా తయారు చేసిన శాండ్ విచ్‌లు ఆరోగ్యానికి మేలే చేస్తాయి. వీటిని కూడా ఆరోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్‌గా చెప్పవచ్చు.
గ్రిల్డ్ వెజ్జీ బర్గర్..
బర్గర్లు అంటే ఇష్టపడని వారు ఉండరు. కానీ వీటిల్లో అధికంగా క్యాలరీలు ఉంటాయి. ఇవి జంక్ ఫుడ్ కిందకు వస్తాయి. అయితే వీటిల్లోనూ ఆరోగ్యకరమైన బర్గర్‌లు ఉంటాయి. ఇకపై మీరు బర్గర్ తినేటప్పుడు గ్రిల్డ్ వెజ్జీ బర్గర్‌ను తినండి. క్రీములను ఉపయోగించకండి. ఇది పూర్తిగా ఆరోగ్యవంతమైన ఆహారంగా పరిగణించబడుతుంది. ఇక బయటకు వెళ్లినప్పుడు ఈ ఆహారాలను కాకుండా చాలా మంది నూనె అధికంగా ఉండే ఆహారాలను, క్రీములు ఉండే ఆహారాలను తింటుంటారు. ఇవన్నీ క్యాలరీలను పెంచుతాయని, బరువు పెరిగేలా చేస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కనుక మీకు ఏదైనా ఫాస్ట్ ఫుడ్ తినాలని అనిపిస్తే పైన చెప్పిన ఆరోగ్యకరమైన ఆహారాలను తినవచ్చు. ఇవి ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయవు. పైగా ఫాస్ట్ ఫుడ్ తిన్న భావన కూడా కలుగుతుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!
ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..
అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!
ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!
వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: