వేసవిలో మాత్రమే వచ్చే చింతచిగురుకు ఉండే డిమాండ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏడాదికి ఒకసారే చింతచిగురు తినే భాగ్యం నగరవాసులకు కలుగుతుంది కాబట్టి ధరను లెక్కచేయకుండా కొంటుంటారు. అయితే, ఈసారి మాత్రం చింతచిగురు ధర ఆకాశంలో విహరిస్తోంది. చికెన్ ధరను మించి పలుకుతోంది. దీంతో దీనిని కొనుగోలుకు జనం ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు.
సాధారణంగా చింతచిగురు కిలో రూ. 200 వరకు పలుకుతుంది. అయితే, ఈసారి రూ. 500కుపైగానే పలుకుతూ గుండెలు గుభేల్‌మనిపిస్తోంది. అదే సమయంలో చికెన్ కిలో రూ. 300 లోపే పలుకుతోంది. గ్రామాల్లో విరివిగా లభించే చింతచిగురుకు ఈసారి హైదరాబాద్‌లో కొరత ఏర్పడింది. రైతుబజార్‌తోపాటు మార్కెట్లలోనూ వీటి ధర బెంబేలెత్తిస్తోంది. దీంతో వినియోగదారులు 50, 100 గ్రాములకే పరిమితమవుతున్నారు. రైతు బజార్లలో 100 గ్రాముల చింతచిగురు రూ. 50కి లభిస్తుండగా బయట మార్కెట్లలో రూ.70 నుంచి 80 మధ్యలో విక్రయిస్తున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
యూఏఈ: కలుషితమైన నీరుతో నివాసుల ఆందోళన! తాగునీటి కొరత! పచ్చగా మారిన నీరు!
సింగపూర్: భారతదేశపు మసాల పౌడర్ బ్యాన్! కెమికల్స్ మోతాదుకు మించి! హెచ్చరించిన ప్రభుత్వం!
ఒమన్: సమ్మర్ షెడ్యూల్ విడుదల చేసిన సలామ్ ఎయిర్! కొత్త గమ్యస్థానాలు! జూన్ నుండి అందుబాటులో!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: