చిన్నారుల ఆహార ఉత్పత్తుల సంస్థ నెస్లే భారత్‌లో నిబంధనలకు విరుద్ధంగా చిన్నపిల్లల ఫుడ్స్‌కు చక్కెరను జోడిస్తున్నట్టు పబ్లిక్ ఐ సంస్థ తన పరిశోధనలో తేల్చింది. బ్రిటన్, జర్మనీ, స్విట్జర్‌ల్యాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రం చక్కెర రహిత ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు తేల్చింది. భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే పాలు, సెరెలాక్ ఉత్పత్తుల్లో చక్కెర, తేనే జోడిస్తున్నట్టు పబ్లిక్ ఐ తేల్చింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం, చిన్నారులకు ఉద్దేశించిన ఉత్పత్తుల్లో చక్కెర జత చేయకూడదు. ఊబకాయం, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఈ నిబంధనను అమల్లోకి తెచ్చారు.
కానీ, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో వంటి పేద దేశాల్లో నెస్లే ఈ నిబంధనను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్టు తేలింది. ఈ వార్తలపై నెస్లే స్పందించింది. గత ఐదేళ్లల్లో తాము భారత్‌లోని చిన్నారుల ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని 30 శాతం మేర తగ్గించామని చెప్పుకొచ్చింది… ఈ ఉత్పత్తులను నిత్యం సమీక్షిస్తూ చక్కెర శాతాన్ని తగ్గించేందుకు మార్పులు చేర్పులు చేస్తుంటామని ప్రకటించింది. పబ్లిక్ ఐ నివేదిక ప్రకారం, నెస్లే భారత్‌లో విక్రయిస్తున్న సెరెలాక్ ఉత్పత్తుల్లో సగటున ఒక్కో సర్వీంగ్‌కు మూడు గ్రాముల చక్కెర ఉంటోంది. థాయిల్యాండ్, ఇథియోపియా ఉత్పత్తులో చక్కెర స్థాయి సర్వీంగ్‌కు ఆరు గ్రాములుగా ఉంది. చాలా సందర్భాల్లో ఆయా ఉత్పత్తుల్లో చక్కెర స్థాయిలను ప్యాకేజింగ్‌పై ముద్రించట్లేదని కూడా పబ్లిక్ ఐ పేర్కొంది. ఇవే ఉత్పత్తుల్ని నెస్లే... చక్కెర లేకుండా ఐరోపాలో విక్రయిస్తోంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!
ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్!! ఏప్రిల్‌లో కచ్చితంగా చేయాల్సిన పన్ను బాధ్యతలు మీ కోసం!!
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ రష్మి!! పెళ్ళికొడుకు ఎవరో కాదండి..
అమెరికా: ఆ నౌక ప్రమాదంలో సిబ్బంది అంత భారతీయులే!! నేడు సందర్శనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!
ఖతార్: ఇండియన్ ఎంబసీ లో క్లర్క్ ఉద్యోగం! నెలకు 1.25 లక్షలు! ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: