ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్యల్లో డ్రగ్స్ ఒకటి. ప్రజలను డ్రగ్స్‌కు బానిసలను చేసి.. వాటి ద్వారా వందలు, వేల కోట్ల రూపాయలు పోగేస్తున్నారు. అంతేకాకుండా దేశ, విదేశాలకు ఈ డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ.. ఇంటర్నేషనల్ డ్రగ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఈ డ్రగ్స్ బారిన పడినవారు.. డబ్బులన్నీ ఖర్చుచేస్తూ, ఆరోగ్యం పాడు చేసుకుని చివరికి ప్రాణాలు వదిలేస్తున్నారు. అయితే రకరకాల డ్రగ్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి.
ఇంకా చదవండి: గాయమైందని 'బ్యాండ్ ఎయిడ్' వేస్తున్నారా? అనారోగ్యానికి వెల్కమ్ చెప్పినట్టు.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు..
ఇందులో మనుషుల ఎముకల నుంచి తయారు చేసే కుష్ డ్రగ్స్ కూడా ఒక రకం. ఈ కుష్ డ్రగ్స్‌ను తయారు చేసేందుకు డ్రగ్స్ ముఠాలు ఏకంగా శ్మశానాలనే తవ్వేస్తున్నాయి. వందలాది సమాధులను తవ్వి అందులోని అస్థిపంజరాలను సేకరించి వాటి నుంచి మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారు. పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియెర్రా లియెన్‌లో మత్తు పదార్థాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మాదకద్రవ్యాల సమస్యలతో ఆ దేశం తీవ్రంగా సతమతమవుతోంది. ఇక సియెర్రా లియోన్‌లో పరిస్థితి చేయిదాటడంతో అక్కడి ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. సియెర్రా లియోన్‌లో చాలామంది యువకులు ఒక రకమైన మత్తు పదార్థం తీసుకొని వీధుల్లో ఎక్కడికక్కడ పడిపోతున్నారు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు జులియస్ బయో ఇటీవల ఎమర్జెన్సీ విధించారు. సియెర్రా లియోన్ ఎదుర్కొనే అతిపెద్ద సమస్యనే కుష్ అనే డ్రగ్స్. ఈ కుష్ డ్రగ్స్ సేవించి అక్కడి జనం మత్తులో ఊగిపోతున్నారు. ఈ కుష్ డ్రగ్స్.. 6 ఏళ్ల క్రితం సియెర్రా లియోన్ దేశంలోకి ప్రవేశించింది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీడీపీ మీద కట్టిన అబద్దాల మేడ కుప్పకూలిపోవడానికి సిద్ధం!!
ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్!! ఏప్రిల్‌లో కచ్చితంగా చేయాల్సిన పన్ను బాధ్యతలు మీ కోసం!!
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్! పెళ్లి పీటలెక్కనున్న యాంకర్ రష్మి!! పెళ్ళికొడుకు ఎవరో కాదండి..
అమెరికా: ఆ నౌక ప్రమాదంలో సిబ్బంది అంత భారతీయులే!! నేడు సందర్శనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
గల్ఫ్ కార్మికులను మోసం చేసిన బీఆర్ఎస్, బీజేపీ!! త్వరలో దుబాయికి సీఎం రేవంత్!!
ఖతార్: ఇండియన్ ఎంబసీ లో క్లర్క్ ఉద్యోగం! నెలకు 1.25 లక్షలు! ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: