సంధ్య థియేటర్ దుర్ఘటన కేసులో నటుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై టాలీవుడ్ హీరో నాని స్పందించారు. ఈ ఘటనకు ఒక్కరినే బాధ్యుడిగా చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్, ఆయన టీమ్, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. ఈరోజు మధ్యాహ్నం అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడంపై నాని ఎక్స్ వేదికగా స్పందించారు. సినిమావాళ్లకు సంబంధించి ఏ విషయంలోనైనా... ప్రభుత్వ అధికారులు, మీడియా చూపిస్తున్న ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని, హృదయ విదారకమైనదని పేర్కొన్నారు. దీని నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నారు. ఇకపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అయితే, ఈ ఘటనలో అందరి తప్పు ఉందని, ఒకరినే బాధ్యుడిగా చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. కాగా, అల్లు అర్జున్ అరెస్ట్‌ను పలువురు సినీ ప్రముఖులు ఖండించారు.
ఇంకా చదవండి: మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు! అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం!
మరోవైపు.. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంపై పుష్ప-2 హీరోయిన్ రష్మిక మందన్న స్పందించారు. ఇప్పుడు నేను చూస్తున్నది నిజమేనా... నమ్మలేకపోతున్నా అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన సంఘటన దురదృష్టకరమైనదని, అత్యంత విషాదభరితమైనదని పేర్కొన్నారు. కానీ దీనంతటికీ ఒక్కరినే దీనికి బాధ్యులుగా చేయడం కలచివేస్తోందని రష్మిక ట్వీట్ చేశారు.
మరోవైపు.. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏదైతే జరిగిందో అది బాధాకరమని (సంధ్య థియేటర్‌లో మహిళ మృతి), కానీ ఇందుకు ఒక వ్యక్తినే నిందించడం దురదృష్టకరమన్నారు. 'బేబీ జాన్' ప్రమోషన్స్‌లో భాగంగా జైపూర్‌లో జరిగిన ఈవెంట్‌లో వరుణ్ ధావన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భద్రతాపరమైన, ఇతర అంశాలను నటీనటులు ఒక్కరే చూసుకోలేరన్నారు. జాగ్రత్తగా ఉండమని సూచించడం మాత్రమే నటీనటులు చేయగలరన్నారు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు.
ఇంకా చదవండి: వైసీపీకి వరుస షాక్ లు.. పార్టీకి రాజీనామా చేయనున్న మాజీ మంత్రి! దానికి కారణం అదేనా?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!
దివ్వెల మాధురికి లైవ్ లో ప్రపోజ్ చేసిన దువ్వాడ! ప్రేమా.? తెగింపా.? తెర వెనుక..
వైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి రాజీనామా చేసిన గంటల్లోనే మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా!
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?
మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న చంద్రబాబు! ఎందుకు అంటే! ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు..
ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మనోజ్! ఏడు నెలల కూతురును కూడా!
వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss
నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదల? ఎప్పుడు అంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: