తన కుటుంబంలో జరుగుతున్న వివాదం నేపథ్యంలో హీరో మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణు తరఫున జర్నలిస్టులకు క్షమాపణ చెప్పారు. ఇలాంటి రోజు వస్తుందనుకోలేదని, తన కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం బాధాకరమన్నారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఎప్పుడూ తోడు ఉంటానని మనోజ్ అన్నారు. "ఆస్తి కోసం నాన్నతో గొడవ పడుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదు.
ఇంకా చదవండి: రికార్డు స్థాయిలో పుష్ప 2 వసూళ్లు - ఎంతో తెలుసా? తొలి భారతీయ చిత్రంగా ఆల్ టైమ్..
నా కుటుంబ సభ్యులను ఏమీ అడగలేదు. ఇంట్లో వాళ్ల ఆదాయం మీద ఆధారపడలేదు. నా భార్య వాళ్లింట్లోనూ ఏమీ అడిగింది లేదు. సొంతంగా వ్యాపారం చేసుకుని సంపాదించుకుంటున్నాను. సొంతకాళ్లపై బతుకుతున్నాను. ఈ వివాదంలోకి నా భార్య, ఏడు నెలల కూతురును కూడా లాగుతున్నారు" అంటూ మనోజ్ కన్నీరు పెట్టుకున్నారు. "మా నాన్న దేవుడు. కానీ, ఈరోజు చూస్తున్నది మా నాన్నను కాదు. వేరేవాళ్లు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు. నేను ఎవరిపై దాడి చేశానో సీసీటీవీ ఫుటేజీ చూపించండి. నేను ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతాను. మిగతా విషయాలు పోలీసుల విచారణ తర్వాత వెల్లడిస్తా" అని మనోజ్ చెప్పుకొచ్చారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదల? ఎప్పుడు అంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss
ఏపీలో కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక.. మంత్రి కీలక ప్రకటన! రాష్ట్రంలో రూ.340 కోట్లతో..
ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!
మరో ఫుడ్ పాయిజన్ ఘటన... రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం! విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ!
ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!
చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: