అల్లు అర్జున్-సుకుమార్ కలయికలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పుష్ప-2' ది రూల్. ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అన్ని భాషల్లోనూ ఈ చిత్రం అత్యంత ప్రజాదరణ పొందుతోంది. కేవలం 5 రోజుల్లోనే రూ.829 కోట్లు వసూలు చేసి, 5 రోజుల్లో అత్యంత వేగవంతంగా ఇంతటి కలెక్షన్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో రికార్డుల మోత మ్రోగించి విడుదల తరువాత కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు విడుదలైన రోజు నుంచి ఈ చిత్రం వసూళ్ల విషయంలో ప్రతి రోజు రికార్డులను నెలకొల్పుతుంది. ఈ రోజు సాయంత్రానికి ఈ చిత్రం రూ.1000 కోట్ల వసూళ్ల సాధించిన చిత్ర జాబితాలో చేరనుంది. కాగా ఈ చిత్రానికి హిందీలో, ఉత్తరాధిలో వసూళ్ల సునామి కొనసాగుతుంది. హిందీలో సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది. తాజాగా కేవలం ఆరు రోజుల్లో హిందీలో రూ.375 కోట్ల వసూళ్లు సాధించిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డును సొంతం చేసుకుంది. మిగతా భాషలతో పోల్చుకుంటే నార్త్‌లో ఈ చిత్రానికి లభించిన ఆదరణ చూస్తుంటే ట్రేడ్ పండితులు ఆశ్చర్చపోతున్నారు. కేవలం వారాంతంలోనే కాకుండా వారంలో మొదటి రోజుల్లో కూడా పుష్ప-2 అత్యధిక కలెక్షన్లు సాధిస్తోంది. కేవలం హిందీలోనే పుష్ప-2 రూ. 700 కోట్లు వసూళ్లు సాధించే అవకాశం వుందని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు
ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదల? ఎప్పుడు అంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss
ఏపీలో కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక.. మంత్రి కీలక ప్రకటన! రాష్ట్రంలో రూ.340 కోట్లతో..
ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!
మరో ఫుడ్ పాయిజన్ ఘటన... రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం! విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ!
ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!
చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: