హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్‌లో ఈ నెల 4న 'పుష్ప-2: ది రూల్' ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా, తీవ్ర గాయాలతో ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన నేపథ్యంలో సదరు థియేటర్ యజమానులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. థియేటర్ లోపల, బయట పూర్తిగా మరమ్మతులు చేయిస్తున్నారు. ఇప్పటికే ఆ పనులు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా పాత సీసీ కెమెరాలను తొలగించి, వాటి స్థానంలో అధునాతనమైన కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రెండు థియేటర్ల (సంధ్య 70ఎంఎం, సంధ్య 35ఎంఎం) గేట్లకు బోర్డులు, కొత్త గ్రిల్స్, మెటల్ డిటెక్టర్లు, ఫైర్ సేఫ్టీ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా యజమానులు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇంకా చదవండి: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వాటిపై 90 శాతం రాయితీ! వెంటనే పొందండి..
తిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం!
పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..
ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!
అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!
నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: