Temple: 310 ఏళ్ల క్రితం బావిలో వెలిసిన దేవుడు..! లక్ష్మి మాధవరాయ స్వామి అద్భుత గాథ!

 మైదుకూరు శ్రీ లక్ష్మీ మాధవరాయ స్వామి ఆలయానికి, గండికోటలోని మాధవరాయ స్వామి ఆలయానికి మధ్య ఉన్నది కేవలం భక్తి బంధం మాత్రమే కాదు, శతాబ్దాల చరిత్రతో ముడిపడిన అ

2026-01-18 14:48:00
Milk Side Effects: పాలలో ఉండే పోషకాలు... ఎముకల బలానికి కాల్షియం మరియు ప్రోటీన్! కానీ....

మైదుకూరు శ్రీ లక్ష్మీ మాధవరాయ స్వామి ఆలయానికి, గండికోటలోని మాధవరాయ స్వామి ఆలయానికి మధ్య ఉన్నది కేవలం భక్తి బంధం మాత్రమే కాదు, శతాబ్దాల చరిత్రతో ముడిపడిన అపూర్వ గాథ. చరిత్రకారుల ప్రకారం 11వ శతాబ్దంలో కాకరాజు గండికోటకు పునాదులు వేయగా, 16వ శతాబ్దంలో పెమ్మసాని రామలింగ నాయుడు అక్కడ శ్రీ మాధవరాయ స్వామి ఆలయాన్ని నిర్మించారు. అయితే 1652లో గోల్కొండ నవాబు కుతుబ్ షాహీ సైన్యాధికారి మీర్ జుమ్లా గండికోటపై దాడికి దిగడంతో ఆలయ భద్రతపై ప్రమాదం పొంచి వచ్చింది. ఈ దాడి విషయం ముందుగానే తెలిసిన అప్పటి పాలకులు గండికోటలోని శ్రీ మాధవరాయ స్వామి విగ్రహాన్ని రహస్యంగా మైదుకూరు ప్రాంతానికి తరలించి, పాతూరులోని ఒక బావిలో దాచినట్లు ప్రచారం ఉంది. దాదాపు 310 సంవత్సరాల తర్వాత ఆ బావి నుంచి విగ్రహాన్ని వెలికితీసి మైదుకూరులో ప్రతిష్ఠించారని భక్తుల విశ్వాసం.

USA Updates: డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్లాన్.. 1 బిలియన్ డాలర్ల ఫీజు నిజమేనా? వైట్ హౌస్ క్లారిటీ!

ఈ ఆలయానికి సంబంధించిన మరో విశేషమైన పురాణ కథ భక్తుల్లో అపార విశ్వాసాన్ని నింపుతుంది. నవాబుల కాలంలో హిందూ ఆలయాలపై విధ్వంసం, దోపిడీ, హింస కొనసాగిన సమయంలో గండికోటలోని మాధవరాయ స్వామి ఆలయాన్ని కూడా ధ్వంసం చేయాలని ప్రయత్నించారట. గర్భగుడి ద్వారాలను పగులగొట్టి సంపదను దోచుకునేందుకు యత్నించిన ఆ దృశ్యాలను స్వామి తట్టుకోలేక గర్భగుడి వెనుక భాగంలో ఒక రంధ్రం చేసి, ఆ రంధ్రం గుండా బయటకు వచ్చి మాండవ్య క్షేత్రమైన మైదుకూరులోని ఒక ‘సెలిమె’లో వెలిశారని కథనం. ఈ సెలిమెనే నేటి మైదుకూరు పాత ఊరిలోని పెద్దబావిగా భక్తులు గుర్తిస్తారు. గండికోట దుర్గం నుంచి మైదుకూరు పెద్దబావి వరకు ఒక రహస్య సొరంగ మార్గం ఇప్పటికీ ఉన్నదని చరిత్రకారులు చెబుతారు.

అమృత్ భారత్ II రైళ్లలో కొత్త రూల్స్.. ఇక ఆ కష్టాలు ఉండవు.. రైల్వే బోర్డు కీలక నిర్ణయం!

ఆ కాలంలో పెద్దబావి చుట్టూ ప్రాంతం అరణ్యాన్ని తలపించేలా ఉండేదట. పొదలు, జిల్లేడు, నల్లేరు చెట్లతో నిండిన ఆ ప్రాంతంలో ఒక మేకల కాపరి తన మందను మేపుతూ ఉండేవాడని కథనం. ఆ మందలోని ఒక మేక ప్రతిరోజూ సెలిమె దగ్గరకు వచ్చి నీరు తాగి, తన పాలు స్వామికి సమర్పించేదట. ఒక రోజు ఆ మేకను గమనించిన కాపరి కోపంతో దుడ్డు కర్రతో కొట్టబోయినప్పుడు ఆ దెబ్బ మేకకు కాకుండా స్వామికి తగిలిందని భక్తుల విశ్వాసం. ఆ దెబ్బతో స్వామి నుదిటిపై గాయం ఏర్పడిందట. ఆ గాయం మచ్చ ఇప్పటికీ స్వామి విగ్రహంపై కనిపిస్తుందని చెబుతారు. ఆ సమయంలో స్వామి స్వయంగా మాట్లాడి “నేను గండికోట నుంచి వచ్చిన మాధవరాయ స్వామిని” అన్నట్లుగా మాటలు వినిపించాయట.

Sankranthi rush: సంక్రాంతి రద్దీతో TGRTCకి కాసుల వర్షం.. 5 రోజుల్లో రూ.67 కోట్ల ఆదాయం!

ఈ ఘటన ఊరంతా వ్యాపించడంతో గ్రామ పెద్దలు, ప్రజలు అందరూ కలిసి స్వామిని గుర్తించి ఆలయం నిర్మించి ప్రతిష్ఠించారు. నాటి నుంచి మైదుకూరులో శ్రీ లక్ష్మీ మాధవరాయ స్వామి భక్తుల కోర్కెలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా ధనుర్మాసంలో పెద్దబావి నీటితో స్వామికి అభిషేకం చేయడం, భక్తులు అదే నీటితో స్నానం చేసి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా మారింది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, కష్టాల్లో ఉన్నవారిని స్వామి ఆదుకుంటారని విశ్వాసం. స్వామి అనుగ్రహంతో జన్మించిన పిల్లలకు స్వామి పేర్లు పెట్టుకునే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. సంక్రాంతిని పురస్కరించుకొని జరిగే ఉత్సవాలు, కనుమ రోజు జరిగే పార్వేట ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి. 16 పల్లెల్లో స్వామి ఊరేగింపు, కళాకారుల నృత్యాలు, డప్పు మేళతాళాల మధ్య జరిగే ఈ వేడుకలు మైదుకూరు ప్రజల భక్తి వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

రాయలసీమలో వ్యవసాయానికి కొత్త దిశ.. 2 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష!!
బండ్ల గణేశ్ 'సంకల్ప యాత్ర'.. షాద్‌నగర్ గడప నుంచి శేషాచలం కొండ దాకా.. బాబు కోసం మొక్కు తీర్చుకునే వేళ!
Indigo: ఇండిగోకు భారీ షాక్... వేల విమానాలు రద్దు!
తెలుగుజాతి వెలుగురేఖ.. 'అన్న' ఎన్టీఆర్ 30వ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన సీఎం చంద్రబాబు! చరిత్ర మార్చిన సంక్షేమ పథకాలు..
Trump: ట్రంప్ ప్రకటనలపై గ్రీన్‌లాండ్ మండిపాటు..! టారిఫ్‌లకు నిరసనగా ర్యాలీ..!
మూడు దశాబ్దాలైనా చెరిగిపోని గౌరవం.. ఎన్టీఆర్ స్మృతి!

Spotlight

Read More →