Lok Sabha seats: 33 శాతం రిజర్వేషన్లు.. 15 ఏళ్ల అమలు.. సీట్ల పెంపుపై తెలంగాణ, ఏపీ నేతల తీవ్ర ఆందోళన.. Lok Sabha: రేపు, ఎల్లుండి లోక్‌సభలో ఓటింగ్.. మహిళా బిల్లు ఆమోదం కోసం దేశమంతా ఉత్కంఠ నిరీక్షణ.! Chandrababu: సీనియర్ల అనుభవం - యువత ఉత్సాహం.. సామాజిక న్యాయమే ప్రాతిపదికగా టీడీపీ కొత్త కమిటీలు.. Amaravati: కలిసికట్టుగా ముందుకు.. మహిళా బిల్లు వేడుకకు వైసీపీని కూడా పిలవాలని కూటమి నిర్ణయం..! Nara Lokesh: క్రీడా దిగ్గజాలతో నారా లోకేశ్ ముఖాముఖి.. తిరుపతి వేదికగా క్రీడాభివృద్ధికి సరికొత్త రోడ్ మ్యాప్! Nara Lokesh: క్రీడా దిగ్గజాలతో నారా లోకేష్ భేటీ! ఏపీలో క్రీడల అభివృద్ధికి సరికొత్త ప్లాన్..! Crude Oil: అమెరికా ఆంక్షల గడువు లోపే చెక్.. ఇరాన్ తో భారత్ చమురు డీల్! Praja Vedika: రేపు (16/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Budget Bikes: తక్కువ మెయింటెనెన్స్.. ఎక్కువ మైలేజీ! రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ బైక్స్ ఇవే..! Vaazha2: మలయాళ సినిమా మరో అద్భుతం.. 'వాళ 2' సంచలనం! రూ.180 కోట్ల వసూళ్ల ప్రభంజనం!! Lok Sabha seats: 33 శాతం రిజర్వేషన్లు.. 15 ఏళ్ల అమలు.. సీట్ల పెంపుపై తెలంగాణ, ఏపీ నేతల తీవ్ర ఆందోళన.. Lok Sabha: రేపు, ఎల్లుండి లోక్‌సభలో ఓటింగ్.. మహిళా బిల్లు ఆమోదం కోసం దేశమంతా ఉత్కంఠ నిరీక్షణ.! Chandrababu: సీనియర్ల అనుభవం - యువత ఉత్సాహం.. సామాజిక న్యాయమే ప్రాతిపదికగా టీడీపీ కొత్త కమిటీలు.. Amaravati: కలిసికట్టుగా ముందుకు.. మహిళా బిల్లు వేడుకకు వైసీపీని కూడా పిలవాలని కూటమి నిర్ణయం..! Nara Lokesh: క్రీడా దిగ్గజాలతో నారా లోకేశ్ ముఖాముఖి.. తిరుపతి వేదికగా క్రీడాభివృద్ధికి సరికొత్త రోడ్ మ్యాప్! Nara Lokesh: క్రీడా దిగ్గజాలతో నారా లోకేష్ భేటీ! ఏపీలో క్రీడల అభివృద్ధికి సరికొత్త ప్లాన్..! Crude Oil: అమెరికా ఆంక్షల గడువు లోపే చెక్.. ఇరాన్ తో భారత్ చమురు డీల్! Praja Vedika: రేపు (16/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Budget Bikes: తక్కువ మెయింటెనెన్స్.. ఎక్కువ మైలేజీ! రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ బైక్స్ ఇవే..! Vaazha2: మలయాళ సినిమా మరో అద్భుతం.. 'వాళ 2' సంచలనం! రూ.180 కోట్ల వసూళ్ల ప్రభంజనం!!

Amaravati: కలిసికట్టుగా ముందుకు.. మహిళా బిల్లు వేడుకకు వైసీపీని కూడా పిలవాలని కూటమి నిర్ణయం..!

Amaravati: అమరావతిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం ముగిసింది. సుమారు రెండున్నర గంటలకు పైగా సాగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురందేశ్వరి తరపున ప్రతినిధులు, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు.

Published : 2026-04-15 21:16:00
  • "అమరావతిలో మహిళా బిల్లు పండుగ": ఈ నెల 17న ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో భారీ కార్యక్రమం..
     
  • Politics: రెండున్నర గంటల పాటు సాగిన ఎన్డీఏ భేటీ: రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై లోతైన చర్చలు..

Chandrababu: అమరావతిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం ముగిసింది. సుమారు రెండున్నర గంటలకు పైగా సాగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురందేశ్వరి తరపున ప్రతినిధులు, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. చారిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లుకు మరియు నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలపాలని ఈ సమావేశంలో కూటమి నేతలు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ వేడుకలో రాజకీయాలకు తావులేకుండా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ సహా అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని నేతలు నిశ్చయించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే ఘట్టాన్ని అమరావతిలో ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ ఏర్పాట్లు చేయాలని కూటమి నిర్ణయించింది. ఈ నెల 17న అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. అమరావతి వేదికగా బిల్లును వీక్షించేలా లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ భారీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించాలని నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచే ఈ బిల్లును పండగ వాతావరణంలో స్వాగతించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై వస్తున్న సందేహాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల పెంపు విషయంలో నెలకొన్న గందరగోళంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పెద్దలతో మాట్లాడి స్పష్టత తీసుకున్నారు. దక్షిణాదికి రాజకీయంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా, 50 శాతం సీట్లు పెరుగుతాయనే విషయంపై కేంద్రం నుంచి భరోసా లభించిందని కూటమి నేతలు స్పష్టం చేశారు. సీట్ల పెంపుపై వస్తున్న అపోహలను నమ్మవద్దని, దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ కలిసికట్టుగా స్వాగతించాలని నేతలు నిర్ణయించారు.

Spotlight

Read More →