Lok Sabha seats: 33 శాతం రిజర్వేషన్లు.. 15 ఏళ్ల అమలు.. సీట్ల పెంపుపై తెలంగాణ, ఏపీ నేతల తీవ్ర ఆందోళన.. Lok Sabha: రేపు, ఎల్లుండి లోక్‌సభలో ఓటింగ్.. మహిళా బిల్లు ఆమోదం కోసం దేశమంతా ఉత్కంఠ నిరీక్షణ.! Chandrababu: సీనియర్ల అనుభవం - యువత ఉత్సాహం.. సామాజిక న్యాయమే ప్రాతిపదికగా టీడీపీ కొత్త కమిటీలు.. Amaravati: కలిసికట్టుగా ముందుకు.. మహిళా బిల్లు వేడుకకు వైసీపీని కూడా పిలవాలని కూటమి నిర్ణయం..! Nara Lokesh: క్రీడా దిగ్గజాలతో నారా లోకేశ్ ముఖాముఖి.. తిరుపతి వేదికగా క్రీడాభివృద్ధికి సరికొత్త రోడ్ మ్యాప్! Nara Lokesh: క్రీడా దిగ్గజాలతో నారా లోకేష్ భేటీ! ఏపీలో క్రీడల అభివృద్ధికి సరికొత్త ప్లాన్..! Crude Oil: అమెరికా ఆంక్షల గడువు లోపే చెక్.. ఇరాన్ తో భారత్ చమురు డీల్! Praja Vedika: రేపు (16/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Budget Bikes: తక్కువ మెయింటెనెన్స్.. ఎక్కువ మైలేజీ! రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ బైక్స్ ఇవే..! Vaazha2: మలయాళ సినిమా మరో అద్భుతం.. 'వాళ 2' సంచలనం! రూ.180 కోట్ల వసూళ్ల ప్రభంజనం!! Lok Sabha seats: 33 శాతం రిజర్వేషన్లు.. 15 ఏళ్ల అమలు.. సీట్ల పెంపుపై తెలంగాణ, ఏపీ నేతల తీవ్ర ఆందోళన.. Lok Sabha: రేపు, ఎల్లుండి లోక్‌సభలో ఓటింగ్.. మహిళా బిల్లు ఆమోదం కోసం దేశమంతా ఉత్కంఠ నిరీక్షణ.! Chandrababu: సీనియర్ల అనుభవం - యువత ఉత్సాహం.. సామాజిక న్యాయమే ప్రాతిపదికగా టీడీపీ కొత్త కమిటీలు.. Amaravati: కలిసికట్టుగా ముందుకు.. మహిళా బిల్లు వేడుకకు వైసీపీని కూడా పిలవాలని కూటమి నిర్ణయం..! Nara Lokesh: క్రీడా దిగ్గజాలతో నారా లోకేశ్ ముఖాముఖి.. తిరుపతి వేదికగా క్రీడాభివృద్ధికి సరికొత్త రోడ్ మ్యాప్! Nara Lokesh: క్రీడా దిగ్గజాలతో నారా లోకేష్ భేటీ! ఏపీలో క్రీడల అభివృద్ధికి సరికొత్త ప్లాన్..! Crude Oil: అమెరికా ఆంక్షల గడువు లోపే చెక్.. ఇరాన్ తో భారత్ చమురు డీల్! Praja Vedika: రేపు (16/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Budget Bikes: తక్కువ మెయింటెనెన్స్.. ఎక్కువ మైలేజీ! రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ బైక్స్ ఇవే..! Vaazha2: మలయాళ సినిమా మరో అద్భుతం.. 'వాళ 2' సంచలనం! రూ.180 కోట్ల వసూళ్ల ప్రభంజనం!!

Nara Lokesh: 12 ఏళ్ల త‌రువాత‌ మొదటి సంవత్సరం 77% ఉత్తీర్ణతతో స‌రికొత్త రికార్డు! లోకేష్ ప్ర‌ణాళిక‌, ప‌ర్య‌వేక్ష‌ణ‌తో..

Nara Lokesh: విద్యాశాఖ సాధించిన విజ‌యాల కంటే వివాదాలే ఎక్కువ అని పేరుప‌డింది. విద్యాశాఖ ఎవ‌రు తీసుకున్నా స‌వాల్ స్వీక‌రించిన‌ట్టే. క‌ష్టం అంటే ఇష్టంగా భావించి..క‌ష్టాల‌ను నేర్పు-ఓర్పుతో అధిగ‌మించే చాలెంజ్ కింగ్ నారా లోకేష్ విద్యాశాఖను చేప‌ట్టి పెను స‌వాల్ స్వీక‌రించారు. విద్యావ్య‌వ‌స్థ‌లో వేళ్లూనుకున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించారు.

Published : 2026-04-15 15:45:00
  • ప్ర‌భుత్వ కాలేజీల్లో ఫ‌స్టియ‌ర్ గ‌తేడాది కంటే 8 శాతం పెరిగి 66 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు…
     
  • ఇంట‌ర్ విద్యార్థుల‌కూ మ‌ధ్యాహ్న‌భోజ‌నం, స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ కిట్లు పంపిణీ.. 
     
  • Politics: ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల్లో  పెరిగిన ఉత్తీర్ణ‌త.. 

Nara Lokesh: విద్యాశాఖ సాధించిన విజ‌యాల కంటే వివాదాలే ఎక్కువ అని పేరుప‌డింది. విద్యాశాఖ ఎవ‌రు తీసుకున్నా స‌వాల్ స్వీక‌రించిన‌ట్టే. క‌ష్టం అంటే ఇష్టంగా భావించి..క‌ష్టాల‌ను నేర్పు-ఓర్పుతో అధిగ‌మించే చాలెంజ్ కింగ్ నారా లోకేష్ విద్యాశాఖను చేప‌ట్టి పెను స‌వాల్ స్వీక‌రించారు. విద్యావ్య‌వ‌స్థ‌లో వేళ్లూనుకున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించారు. సంస్క‌ర‌ణ‌ల‌కు నాంది ప‌లికారు. ప్ర‌ణాళికాబ‌ద్ధంగా విద్యావ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టారు. క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం ఇంట‌ర్ ఫ‌లితాల రూపంలో క‌నిపించే స‌రికి విద్యాశాఖా మంత్రి నారా లోకేష్  మోములో విజ‌య‌ద‌ర‌హాసం మెరిసింది.

మంత్రి కృషితో 12 ఏళ్ల త‌రువాత
ఈ ఏడాది ఇంటర్మీడియట్  ఫలితాలు 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యుత్తమ ఫలితాలు వ‌చ్చాయి. విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌లు, అమ‌లుచేసిన ప్ర‌ణాళిక‌ల వ‌ల్లే మెరుగైన ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని విద్యావేత్త‌లు విశ్లేషిస్తున్నారు.

ఇంట‌ర్‌లో మెరుగైన ఫ‌లితాలు
మొదటి సంవత్సరం 77% ఉత్తీర్ణత..ఇది గత 12 ఏళ్లలో అత్యధికం.
రెండవ సంవత్సరం 81% ఉత్తీర్ణత..ఇది గత 12 ఏళ్లలో రెండవ అత్యుత్తమ ఫలితం.

ప్రభుత్వ నిర్వహణలోని విద్యాసంస్థల్లో ..
మొదటి సంవత్సరం 66% ఉత్తీర్ణతతో గత 12 ఏళ్లలోనే రికార్డు సృష్టించాయి.
రెండవ సంవత్సరం 76% ఉత్తీర్ణతతో గత 12 ఏళ్లలో రెండవ ఉత్తమ ఫ‌లితాలు న‌మోద‌య్యాయి.

సంక్షేమం-సంస్క‌ర‌ణ‌లు
ఇప్ప‌టివ‌ర‌కూ హైస్కూలు విద్యార్థుల‌కే అమ‌ల‌వుతున్న డొక్కా సీత‌మ్మ మ‌ధ్యాహ్న బ‌డి భోజ‌నంను ఇంట‌ర్ విద్యార్థుల‌కూ అమ‌లు చేశారు.  స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు, పోటీ పరీక్షల మెటీరియల్,  సైన్స్ ప్రాక్టికల్ రికార్డులు/మాన్యువల్స్‌ను పంపిణీ చేశారు. ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్ పోస్టులను అర్హులైన జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులతో భర్తీ చేశారు. బోధనా సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను గెస్ట్ ఫ్యాకల్టీతో భర్తీ చేసి, బోధనకు అంతరాయం లేకుండా చూశారు.

ప్ర‌ణాళిక‌- పర్యవేక్షణ
జూనియ‌ర్ కాలేజీ విద్యార్థుల‌కు ప‌క‌డ్బందీగా యూనిట్ టెస్టులు, క్వార్ట‌ర్లీ, హాఫ్ ఇయ‌ర్లీ, ప్రీ-ఫైనల్ పరీక్షలను కేంద్రీకృత పద్ధతిలో నిర్వహించారు. పరీక్షా ఫలితాలను డ్యాష్‌బోర్డ్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ, విద్యార్థుల మార్కుల ఆధారంగా టీచర్ల పనితీరును ప్రతి నెలా సమీక్షించారు. కళాశాల పని వేళలను ఉదయం 9:30 నుంచి 9 గంట‌ల‌కు సాయంత్రం 4 గంట‌ల నుంచి 5 గంట‌ల వరకు మార్చారు.

'సంకల్పం - 2026' (50 రోజుల విజయ ప్రణాళిక)
విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి వారిని A, B, C కేటగిరీలుగా విభజించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. విద్యార్థులు ఏ స‌బ్జెక్టుల్లో ఇంకా మెరుగు కావాలో గుర్తించి ఆ దిశ‌గా శిక్ష‌ణ అందించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను రూపొందించి పంపిణీ చేశారు.

తీసుకున్న చ‌ర్య‌లు
కేర్ టేకర్ వ్యవస్థ ద్వారా ప్రతి జూనియర్ లెక్చరర్ కనీసం 10 మంది విద్యార్థులను దత్తత తీసుకుని, వారి హాజరు, ఫలితాల బాధ్యతను స్వీకరించారు.
విద్యార్థుల సంక్షేమం చూస్తూనే ఇందులో తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంపొందించారు. 
జూనియ‌ర్ కాలేజీల్లో ఏడాదికి రెండుసార్లు మెగా పేరెంట్ టీచ‌ర్ మీటింగులు నిర్వ‌హించి.. పిల్ల‌ల ప్ర‌గ‌తిని వివ‌రించే ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు.
డిజిటల్ కనెక్టివిటీతో స‌త్ఫ‌లితాలు సాధించారు. సిలబస్ పురోగతిని తల్లిదండ్రులకు తెలియజేయడానికి క్లాస్ వారీగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కొత్త ప్రశ్నపత్రం విధానం ప్రవేశపెట్టడం వల్ల, వారు అన్ని సబ్జెక్టులలో అత్యధిక స్కోరు సాధించడానికి మంచి అవకాశం ఏర్పడింది.

విద్యాశాఖా మంత్రిగా నారా లోకేష్ ప‌ట్టుద‌ల‌, కృషితో ఇంట‌ర్ మీడియ‌ట్‌లో మెరుగైన ఫ‌లితాలు వ‌చ్చాయి. క్షేత్ర‌స్థాయి నుంచి వ‌చ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా..అధికారులు, నిపుణుల సూచ‌న‌లు-స‌ల‌హాల‌తో రూపొందించిన  ప్ర‌ణాళిక ప‌క‌డ్బందీగా అమ‌లు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరంత‌రం ప‌ర్య‌వేక్షించారు. ల‌క్ష్యానికి చేరుకున్నారు. ఇంట‌ర్‌లో మెరుగైన ఫ‌లితాలు సాధించారు.

Spotlight

Read More →