TDP MP: బెంగళూరు నుంచే కుట్రలు.. జగన్‌కు బీఆర్‌ఎస్‌ మద్దతు! ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

 బీఆర్‌ఎస్‌, వైసీపీ పార్టీల మధ్య లోపాయికారీ రాజకీయ కుమ్మక్కు స్పష్టంగా కనిపిస్తోందని, ఈ రెండు పార్టీలు కలిసి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అసత్య

2026-01-19 17:09:00
Iranian people: మమ్మల్ని ఆయుధాల్లా వాడుకుని వదిలేశారు... ట్రంప్‌పై ఇరాన్ ప్రజల ఆరోపణలు!

బీఆర్‌ఎస్‌, వైసీపీ పార్టీల మధ్య లోపాయికారీ రాజకీయ కుమ్మక్కు స్పష్టంగా కనిపిస్తోందని, ఈ రెండు పార్టీలు కలిసి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. గోదావరి జలాల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, బీఆర్‌ఎస్‌, వైసీపీ పార్టీల అజెండా ఒక్కటేనని, రాష్ట్రాల మధ్య విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లాభాలు పొందాలన్నదే వారి లక్ష్యమని స్పష్టం చేశారు.

Trump fires: 20 ఏళ్లుగా చెబుతున్నాం.. ఇక టైమ్ వచ్చింది.. డెన్మార్క్‌పై ట్రంప్ ఫైర్!

జగన్‌ కోర్టుకు హాజరైన సమయంలో బీఆర్‌ఎస్‌ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతం పలకడం, అదే విధంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఖమ్మం వెళ్లినప్పుడు వైసీపీ నేతలు ఫ్లెక్సీలు కట్టి ఆహ్వానం పలకడం ఈ రెండు పార్టీల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు నిదర్శనమని కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో స్నేహం పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం సరికాదని, ఇలాంటి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. బహిరంగంగా విమర్శలు చేసుకుంటూనే లోపల మాత్రం చేతులు కలిపి రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు.

Smartphone: స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లో చరిత్ర..! విద్యార్థుల ఆలోచనలతో రియల్‌మీ P4 పవర్!

వైసీపీ అధినేత జగన్‌ బెంగళూరులో కూర్చొని కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, ఆ కుట్రల్లో బీఆర్‌ఎస్‌ నేతలు కూడా భాగస్వాములవుతున్నారని ఆయన ఆరోపించారు. ఐదేళ్లు ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్‌ రాయలసీమ ప్రాంతానికి ఒక్క పరిశ్రమైనా తీసుకువచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రజా సమస్యలను పక్కనపెట్టి, సొంత వ్యాపారాలు, రాజకీయ లాభాలకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, యువతకు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.

జూరిక్ లో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం! ఎన్నారైలతో ఆత్మీయ ఫోటోషూట్.. లింక్! తెలుగు డియాస్పోరా మీట్ లో..

ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్‌ తరాల ప్రయోజనాలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతోందని కలిశెట్టి అప్పలనాయుడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు టీడీపీ కట్టుబడి ఉందన్నారు. వైసీపీ, బీఆర్‌ఎస్‌ రాజకీయ కుతంత్రాలను ప్రజలు పూర్తిగా గుర్తించారని, వచ్చే రోజుల్లో ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం తప్పదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Gynecologic Cancer: గైనిక్ క్యాన్సర్ రేడియేషన్‌కు కొత్త రక్షణ కవచం..! ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల సరికొత్త ప్రయోగం!
Keeravani Republic Day: తెలుగు సంగీతానికి జాతీయ గౌరవం.. గణతంత్ర పరేడ్లో కీరవాణి!
దావోస్ వేదికగా ఏపీ 'పెట్టుబడుల వేట'.. పక్కా ప్రణాళికతో చంద్రబాబు బృందం.. క్వాంటం వ్యాలీ నుంచి గ్రీన్ ఎనర్జీ దాకా!
ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు.. వైసీపీ ఎంపీకి నోటీసులు.. వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ!
Train accident: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 39కి చేరిన మృతుల సంఖ్య!
Tech News: ఫోన్ వాడకపోయినా బ్యాటరీ ఖాళీ అవుతుందా? అసలు కారణాలు ఇవే.. సులభంగా పరిష్కారం ఇలా..!!

Spotlight

Read More →