Dhurandhar 2: కోర్టు కేసుల మధ్య 'ధురంధర్ 2' ఓటీటీ రాక.. ఇండియాలో స్ట్రీమింగ్‌పై ఇంకా వీడని సస్పెన్స్! అయితే భారత్ లో కాదు! Vijay: తమిళనాడులో బిగ్ ట్విస్ట్.. రేపు విజయ్ ప్రమాణ స్వీకారంపై మళ్లీ సస్పెన్స్! 118 మంది ఎమ్మెల్యేలతో.. Indonesia: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం ఉగ్రరూపం... ముగ్గురి మృతి! 4 కిలోమీటర్ల పరిధిలో.. Chandrababu: ఏడవ జిల్లా కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయం.. పావలా వడ్డీ విద్యా రుణాలకు సీఎం గ్రీన్ సిగ్నల్! Atchennaidu: ఖరీఫ్‌ రైతుకు అండగా ప్రభుత్వం.. విత్తనాలు, ఎరువులు, నీటితో పూర్తి సన్నద్ధత! IPL 2028: ఐపీఎల్‌లో భారీ మార్పులు.. 2028 నుంచి 94 మ్యాచ్‌ల మెగా టోర్నీ! Ram Mohan Naidu: విమానాల లీజింగ్‌లో భారత్ కొత్త కేంద్రం.. గిఫ్ట్ సిటీపై ప్రపంచ దృష్టి! Saudi Arabia: సౌదీ ఎడారిలో జగిత్యాల యువకుడి నరకయాతన... సీఎం ప్రవాసీ ప్రజావాణికి చేరిన బాధితుడి గోడు.. తక్షణ చర్యలకు అధికారుల ఆదేశం!! TamilNadu Election 2026: తమిళనాడులో నవ శకం... మే 9న సీఎంగా 'దళపతి' విజయ్ ప్రమాణ స్వీకారం! Air Asia: విమానయాన చరిత్రలో రికార్డు... ఎయిర్ ఆసియా గూటికి 150 ఎయిర్‌బస్ ఏ220 జెట్లు! Dhurandhar 2: కోర్టు కేసుల మధ్య 'ధురంధర్ 2' ఓటీటీ రాక.. ఇండియాలో స్ట్రీమింగ్‌పై ఇంకా వీడని సస్పెన్స్! అయితే భారత్ లో కాదు! Vijay: తమిళనాడులో బిగ్ ట్విస్ట్.. రేపు విజయ్ ప్రమాణ స్వీకారంపై మళ్లీ సస్పెన్స్! 118 మంది ఎమ్మెల్యేలతో.. Indonesia: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం ఉగ్రరూపం... ముగ్గురి మృతి! 4 కిలోమీటర్ల పరిధిలో.. Chandrababu: ఏడవ జిల్లా కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయం.. పావలా వడ్డీ విద్యా రుణాలకు సీఎం గ్రీన్ సిగ్నల్! Atchennaidu: ఖరీఫ్‌ రైతుకు అండగా ప్రభుత్వం.. విత్తనాలు, ఎరువులు, నీటితో పూర్తి సన్నద్ధత! IPL 2028: ఐపీఎల్‌లో భారీ మార్పులు.. 2028 నుంచి 94 మ్యాచ్‌ల మెగా టోర్నీ! Ram Mohan Naidu: విమానాల లీజింగ్‌లో భారత్ కొత్త కేంద్రం.. గిఫ్ట్ సిటీపై ప్రపంచ దృష్టి! Saudi Arabia: సౌదీ ఎడారిలో జగిత్యాల యువకుడి నరకయాతన... సీఎం ప్రవాసీ ప్రజావాణికి చేరిన బాధితుడి గోడు.. తక్షణ చర్యలకు అధికారుల ఆదేశం!! TamilNadu Election 2026: తమిళనాడులో నవ శకం... మే 9న సీఎంగా 'దళపతి' విజయ్ ప్రమాణ స్వీకారం! Air Asia: విమానయాన చరిత్రలో రికార్డు... ఎయిర్ ఆసియా గూటికి 150 ఎయిర్‌బస్ ఏ220 జెట్లు!

Vijay: తమిళనాడులో బిగ్ ట్విస్ట్.. రేపు విజయ్ ప్రమాణ స్వీకారంపై మళ్లీ సస్పెన్స్! 118 మంది ఎమ్మెల్యేలతో..

Vijay: తమిళనాడులో మరో బిగ్ ట్విస్ట్. టీవీకే అధినేత విజయ్ 118 మంది ఎమ్మెల్యేలతో కూడిన జాబితాను గవర్నర్‌కు అందజేశారని, దీంతో రేపు ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారని టీవీకే, వామపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి.

Published : 2026-05-08 22:03:00
  • గవర్నర్‌కు వీసీకే, ఐయూఎంఎల్ నుంచి అందని మద్దతు లేఖలు..
     
  • Politics: కాంగ్రెస్, వామపక్షాల నుంచి మాత్రమే అందిన మద్దతు లేఖలు..

Vijay: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న ప్రచారం మధ్య రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. విజయ్ తన వద్ద 118 మంది ఎమ్మెల్యేల బలం ఉందని పేర్కొంటూ గవర్నర్‌కు జాబితాను అందజేసినట్లు, రేపు ఉదయం 11 గంటలకు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని టీవీకే మరియు వామపక్ష వర్గాలు సంబరాలు మొదలుపెట్టాయి. అయితే, విజయ్‌ని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేదని లోక్ భవన్ వర్గాలు స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.

ప్రస్తుత సమీకరణాల ప్రకారం, టీవీకే పార్టీకి కాంగ్రెస్ మరియు వామపక్షాలు తమ మద్దతును ప్రకటించాయి. విజయ్ శుక్రవారం సాయంత్రం మూడోసారి గవర్నర్‌ను కలిసి తనకు మద్దతునిస్తున్న సభ్యుల జాబితాను సమర్పించారు. కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేయగా, వామపక్షాలు కూడా శుక్రవారమే తమ ఆమోద పత్రాన్ని సమర్పించాయి. అయితే, కీలకమైన సమయంలో విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) మరియు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీలు తమ వైఖరిని మార్చుకోవడం విజయ్ శిబిరాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఈ పార్టీలు తొలుత మద్దతు ఇస్తామని చెప్పినప్పటికీ, గవర్నర్‌కు అధికారికంగా ఎటువంటి మద్దతు లేఖలను అందజేయలేదు.

చివరి నిమిషంలో చోటుచేసుకున్న ఈ పరిణామాల వల్ల విజయ్ సంఖ్యాబలం 116 వద్ద నిలిచిపోయింది. టీవీకేకు స్వయంగా 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు, వామపక్షాలకు చెందిన నలుగురు సభ్యులు ఆయన వెంటే ఉన్నారు. కానీ, ఐయూఎంఎల్ తాజాగా మద్దతు ఇవ్వబోమని ప్రకటించడం, వీసీకే తన నిర్ణయాన్ని వాయిదా వేయడంతో మేజిక్ ఫిగర్‌కు అవసరమైన బలం లభించలేదు. మద్దతు లేఖల్లో స్పష్టత లేకపోవడంతో గవర్నర్ కార్యాలయం వెనక్కి తగ్గింది. దీంతో తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది.


 

Spotlight

Read More →