రాయలసీమకు ‘రాయల్’ కళ వస్తోందని ప్రతిబించేలా చంద్రబాబు పోస్ట్..
తిరుపతిలో భారీ పెట్టుబడులకు సిద్ధమైన దిగ్గజ మోటార్ సైకిల్ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్..
అమరావతి: రాష్ట్ర అభివృద్ధిపై కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన ప్రత్యేక శైలిలో ఆకట్టుకున్నారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధిని ప్రతిబింబించేలా “రాయలసీమ ఇక ‘రాయల్’సీమ” అంటూ చేసిన తాజా సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాయలసీమలో పరిశ్రమలు, పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పేరు మరింత అర్థవంతంగా మారుతోంది. ముఖ్యంగా తిరుపతిలో భారీ పెట్టుబడులతో ముందుకు రావడానికి సిద్ధమైన ప్రముఖ మోటార్ సైకిల్ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ కారణంగా ఈ ప్రాంతానికి కొత్త వెలుగు వస్తోందని సీఎం సూచించారు. రాయలసీమకు ‘రాయల్’ కళ వస్తోందనే సందేశాన్ని ఈ పోస్ట్ ద్వారా ప్రజలకు చేరవేశారు.
ఇది మొదటిసారి కాదు. ఇటీవల విశాఖపట్నంలో డేటా రంగంలో పెద్ద పెట్టుబడులు రాబోతున్న సందర్భంలో కూడా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పోస్టు చేశారు. ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ వైజాగ్‌కు రానున్న నేపథ్యంలో, గూగుల్‌ను ప్రతిబింబించేలా సృజనాత్మకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఇలా ప్రాంతాల అభివృద్ధిని సరికొత్తగా ప్రజలకు వివరించే ప్రయత్నంలో సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. రాయలసీమను ‘రాయల్’సీమగా మార్చే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.