బెంగుళూరులో ఎంతో ఫేమస్ అయిన 'బెన్నె దోశ'.. ఇంట్లోనే సింపుల్ గా.. ఆ కరకరలాడే రుచి రహస్యం మీకోసం! Trumps comments: ఆమెను చూసే పోస్టింగ్ ఇచ్చా.. ట్రంప్ వ్యాఖ్యలతో కొత్త వివాదం! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! SmartWashing: కరెంట్ బిల్లుకు చెక్.. శ్రమకు ఫుల్ స్టాప్! గృహిణుల కోసం వచ్చిన ఈ 'మ్యాజిక్' మెషీన్ చూశారా? Dhurandhar OTT: 10 నిమిషాల సీన్లు మాయం.. ‘ధురంధర్’ OTT వెర్షన్‌పై ఆగ్రహం! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! JEE Main: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ముగిసింది…! ఇప్పుడు విద్యార్థుల ముందున్న అసలు పరీక్ష ఇదే! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Vankaya Royyala Curry: వంకాయ ఎండు రొయ్యల కూర.. ఈ చిట్కాతో వండితే బిర్యానీ కూడా దిగదుడుపే! బడ్జెట్ 2026... రైల్వే రంగంలో భారీ మార్పులు! బెంగుళూరులో ఎంతో ఫేమస్ అయిన 'బెన్నె దోశ'.. ఇంట్లోనే సింపుల్ గా.. ఆ కరకరలాడే రుచి రహస్యం మీకోసం! Trumps comments: ఆమెను చూసే పోస్టింగ్ ఇచ్చా.. ట్రంప్ వ్యాఖ్యలతో కొత్త వివాదం! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! SmartWashing: కరెంట్ బిల్లుకు చెక్.. శ్రమకు ఫుల్ స్టాప్! గృహిణుల కోసం వచ్చిన ఈ 'మ్యాజిక్' మెషీన్ చూశారా? Dhurandhar OTT: 10 నిమిషాల సీన్లు మాయం.. ‘ధురంధర్’ OTT వెర్షన్‌పై ఆగ్రహం! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! JEE Main: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ముగిసింది…! ఇప్పుడు విద్యార్థుల ముందున్న అసలు పరీక్ష ఇదే! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Vankaya Royyala Curry: వంకాయ ఎండు రొయ్యల కూర.. ఈ చిట్కాతో వండితే బిర్యానీ కూడా దిగదుడుపే! బడ్జెట్ 2026... రైల్వే రంగంలో భారీ మార్పులు!

Vankaya Royyala Curry: వంకాయ ఎండు రొయ్యల కూర.. ఈ చిట్కాతో వండితే బిర్యానీ కూడా దిగదుడుపే!

వంకాయ ఎండు రొయ్యల కూరను పక్కా పల్లెటూరి రుచితో ఎలా వండాలో.. ఎండు రొయ్యల నీచు వాసన రాకుండా ఉండే రహస్య చిట్కా మరియు బ్యాచిలర్స్ కోసం సులభమైన వంట విధానం

Published : 2026-01-30 17:25:00

మాంసాహార ప్రియులు వారమంతా నాన్-వెజ్ వండినా లొట్టలు వేసుకుంటూ తింటారు. అయితే ప్రతిరోజూ చికెన్, చేపలు లేదా పచ్చి రొయ్యలు తెచ్చుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు వంకాయ కూరలో కాస్త ఎండు రొయ్యలు వేసి వండితే.. ఆ వాసనకే ఆకలి రెట్టింపవుతుంది. వంకాయ, ఎండు రొయ్యల కాంబినేషన్ అంటేనే 'వేరే లెవెల్'. పర్ఫెక్ట్‌గా అన్ని దినుసులు వేసి వండితే, ఆ అమోఘమైన రుచి ముందు చికెన్, మటన్ బిర్యానీలు కూడా సరిపోవండోయ్! మరింకెందుకు ఆలస్యం? బ్యాచిలర్ బాయ్స్, మ్యారీడ్ గర్ల్స్.. గెట్ రెడీ! ఈ వంకాయ-ఎండు రొయ్యల కూరను కుమ్మేద్దాం రండి.

కావలసిన పదార్థాలు:

 వంకాయలు: అర కిలో (తాజావి)

 ఎండు రొయ్యలు: 100 గ్రాములు (మీకు ఇష్టమైతే ఇంకాస్త ఎక్కువ వేసుకోవచ్చు)

ఉల్లిపాయలు: రెండు

 పచ్చిమిర్చి: నాలుగు

టమాటాలు: రెండు (మధ్యస్థ పరిమాణం)

పసుపు: ఒక స్పూన్

 ఉప్పు: తగినంత

 కారం: రెండు స్పూన్లు

ముఖ్యమైన చిట్కా: ఎండు రొయ్యలు పచ్చి రొయ్యల్లా మెత్తగా, టేస్టీగా రావాలంటే.. ఒక చిన్న ట్రిక్ పాటించండి. రొయ్యలను శుభ్రం చేసి, కాస్త పసుపు వేసి ప్రెజర్ కుక్కర్‌లో ఉంచి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇలా చేయడం వల్ల ఎండు రొయ్యల నీచు వాసన పోవడమే కాకుండా, అవి పచ్చి రొయ్యల్లా తయారవుతాయి. ఆ తర్వాత వాటిని నూనెలో వేయిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.

ముందుగా స్టవ్ వెలిగించి, మీడియం మంటపై ఒక మందపాటి గిన్నెను పెట్టుకోండి. గిన్నె వేడెక్కాక నూనె వేసి, అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేయండి. వెంటనే పసుపు, కారం, ఉప్పు వేసి మీడియం మంటపై మగ్గనివ్వండి. కూర నుండి నూనె పైకి తేలే వరకు మూత పెట్టి ఉంచండి.

వంకాయ ముక్కలు మగ్గినట్లు అనిపించినప్పుడు, ఒక గ్లాసు నీరు పోయండి. కూరను ఒకసారి బాగా కలిపి, ఉప్పు-కారం సరి చూసుకోండి. కూర పై నూనె పైకి తేలేంతవరకు ఉంచి దించేయండి. అంతే గుమగుమలాడే వంకాయ - ఎండు రొయ్యల కర్రీ రెడీ వేడివేడి అన్నంలో ఈ కూర కలుపుకొని తింటుంటే.. ఎంతటి వారైనా మీ వంటకు ఫిదా అవ్వాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం మీరు వండి మీ ఆత్మీయులకు వడ్డించండి..

Spotlight

Read More →