ప్రతీ తల్లిదండ్రి పిల్లలు ఆరోగ్యంగా తెలివిగా ఎదగాలని కోరుకుంటారు. అందుకోసం ఏం తినిపించాలో ఎలా తినిపించాలో ఎక్కువ శ్రద్ధ చూపుతారు. పిల్లల డైట్‌లో డ్రై ఫ్రూట్స్‌కి మంచి స్థానం ఉంది. వాటిలో తక్కువ ధరలో లభించే (కిస్‌మిస్) ఎండుద్రాక్ష చాలా ఉపయోగకరం. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం, ఫైబర్, విటమిన్లు పిల్లల ఎదుగుదలకి చాలా సహాయపడతాయి.
కిస్‌మిస్‌లో ఉండే ఐరన్ విటమిన్ బీ వల్ల పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పాఠశాలలో నేర్చుకున్నది బాగా గుర్తుంచుకుంటారు. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. చదువులో ఆసక్తి పెరుగుతుంది. ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల ఇమ్యూనిటీని బలపరుస్తాయి. దీంతో తరచుగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ సమస్యలు తగ్గుతాయి.
కిస్‌మిస్‌లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. పిల్లలు నీరసంగా కాకుండా చురుకుగా ఉంటారు. ఐరన్ లోపం ఉన్న పిల్లలకు కిస్‌మిస్ చాలా మేలు చేస్తుంది. ఎండుద్రాక్షలో ఉండే కాల్షియం, బోరాన్ ఎముకలను బలంగా చేస్తాయి. ఎదుగుతున్న పిల్లలకు ఇవి చాలా అవసరం. పాలు తాగని పిల్లలకు కిస్‌మిస్ మంచి ప్రత్యామ్నాయం అవుతుంది.
ఎండుద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. రోజూ కొద్దిగా కిస్‌మిస్ తింటే జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. తినడానికి ఇష్టపడని పిల్లలకు కిస్‌మిస్ ఇవ్వడం ద్వారా ఆకలి పెరుగుతుంది. ఇందులోని సహజ చక్కెర శక్తిని ఇస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. విటమిన్ ఎ వల్ల కంటి చూపు కూడా మెరుగవుతుంది.
పిల్లలకు ఎనిమిది లేదా పది నెలల వయసు వచ్చిన తర్వాత కిస్‌మిస్ ఇవ్వొచ్చు. మొదట నేరుగా ఇవ్వకూడదు. రాత్రి నాలుగు ఎండుద్రాక్ష నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీరు తాగించాలి. లేదా కిస్‌మిస్ ముక్కలుగా కట్ చేసి ఉగ్గులో లేదా పాయసంలో కలిపి ఇవ్వొచ్చు.
సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమే ఒక్కొక్కరి ఆరోగ్యం ఒక్కోలా ఉంటుంది. కాబట్టి, కిస్‌మిస్ ఇవ్వేముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.