AP Government: ఏపీలో వారికి ఎగిరిగంతేసే వార్త... ప్రభుత్వం సంచలన నిర్ణయం! Blood Pressure: బీపీని అస్సలు లైట్ తీసుకోవద్దు.. నిర్లక్ష్యం చేస్తే అవి తప్పవంటున్న వైద్యులు! Pawankalyan: పల్లెల ప్రగతికి పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్.. క్షేత్రస్థాయి సర్వేకు కీలక ఆదేశాలు! Vladimir Putin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మరోసారి భారత్‌కు పుతిన్.. అంతర్జాతీయ వేదికపై ఉత్కంఠ! Chandrababu: స్వయంగా చేపలు కొని, గరిటె తిప్పి.. మత్స్యకార కుటుంబంతో చంద్రబాబు భోజనం.. PM Modi: మోదీ తీరుపై నార్వే జర్నలిస్టు అసంతృప్తి... ఘాటుగా సమాధానం ఇచ్చిన విదేశాంగ శాఖ అధికారి.. Cricket Australia: భారత్‌లో బీబీఎల్ మ్యాచ్‌లు.. క్రికెట్ లవర్స్ కు పండగే! రెండో లేదా మూడో వారంలో... Kollu Ravindra: మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండ! మత్స్యకారుల సేవలో మంత్రి కొల్లు రవీంద్ర! TDP: పెట్రోల్ ధరలపై వైసీపీ ధర్నాలు రాజకీయ డ్రామా.. ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శలు! Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు... ఆ నియోజకవర్గానికి వెళ్తే ఆత్మీయత కనిపిస్తుంది.! AP Government: ఏపీలో వారికి ఎగిరిగంతేసే వార్త... ప్రభుత్వం సంచలన నిర్ణయం! Blood Pressure: బీపీని అస్సలు లైట్ తీసుకోవద్దు.. నిర్లక్ష్యం చేస్తే అవి తప్పవంటున్న వైద్యులు! Pawankalyan: పల్లెల ప్రగతికి పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్.. క్షేత్రస్థాయి సర్వేకు కీలక ఆదేశాలు! Vladimir Putin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మరోసారి భారత్‌కు పుతిన్.. అంతర్జాతీయ వేదికపై ఉత్కంఠ! Chandrababu: స్వయంగా చేపలు కొని, గరిటె తిప్పి.. మత్స్యకార కుటుంబంతో చంద్రబాబు భోజనం.. PM Modi: మోదీ తీరుపై నార్వే జర్నలిస్టు అసంతృప్తి... ఘాటుగా సమాధానం ఇచ్చిన విదేశాంగ శాఖ అధికారి.. Cricket Australia: భారత్‌లో బీబీఎల్ మ్యాచ్‌లు.. క్రికెట్ లవర్స్ కు పండగే! రెండో లేదా మూడో వారంలో... Kollu Ravindra: మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండ! మత్స్యకారుల సేవలో మంత్రి కొల్లు రవీంద్ర! TDP: పెట్రోల్ ధరలపై వైసీపీ ధర్నాలు రాజకీయ డ్రామా.. ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శలు! Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు... ఆ నియోజకవర్గానికి వెళ్తే ఆత్మీయత కనిపిస్తుంది.!

Delhi: దేశ రాజధానిలో మండుతున్న ఎండలు.. మూడు రోజుల ఎల్లో అలర్ట్!

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు రోజురోజుకీ మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 2026-05-19 16:12:00

వడగాలులతో ఢిల్లీ వణుకు.. ఐఎండీ హెచ్చరికలు..

దేశ రాజధానిపై ఎండల ఎఫెక్ట్.. వడగాలులపై ఎల్లో అలర్ట్..

దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు రోజురోజుకీ మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వచ్చే మూడు రోజుల పాటు ఢిల్లీలో వడగాలుల పరిస్థితులు కొనసాగనున్నాయని హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఎండలు, వేడి గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉందని తెలిపింది.

ఐఎండీ అంచనాల ప్రకారం, ఇవాళ ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత సుమారు 28 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉండొచ్చని పేర్కొంది. గత 24 గంటల్లో కూడా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. రాత్రి సమయంలో కూడా ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల వద్ద కొనసాగడంతో ప్రజలకు ఉపశమనం లేకుండా పోయింది.

ఢిల్లీ రిడ్జ్ ప్రాంతంలోని ఐఎండీ కేంద్రంలో అత్యధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సఫ్దర్‌జంగ్ కేంద్రంలో 43.4 డిగ్రీలు, లోధీ రోడ్ కేంద్రంలో 43.8 డిగ్రీలు, పాలం ప్రాంతంలో 43.5 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. ఉదయం నుంచే మండుతున్న ఎండలు, వేడిగాలులతో రహదారులు వెలవెలబోతున్నాయి.

వైద్య నిపుణులు ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. తగినంత నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, ఎండ నుంచి జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని హెచ్చరిస్తున్నారు. మరోవైపు, ఎండల తీవ్రతతో విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగింది. ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు మరికొన్ని రోజులు ఇదే విధంగా కొనసాగే అవకాశముందని ఐఎండీ తెలిపింది.

Spotlight

Read More →