Cooking oil: వంట నూనె డబ్బా తెరిచాక ఎన్ని రోజులు వాడొచ్చు? అసలు నిజాలు ఇవే! Health Tips: పదే పదే టీ వేడి చేసి తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే! Yogandhra: ‘యోగాంధ్ర-2026’కు ఏపీ సిద్ధం.. రాష్ట్రవ్యాప్తంగా భారీ యోగా వేడుకలు! Health tips: ఉడకబెట్టిన గుడ్డు వర్సెస్ ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్? Vitamin B12: మన బాడీలో ఇది తగ్గినా, పెరిగినా క్యాన్సర్ వస్తుందంట! Healthy Food: ఈ 10 రకాల స్నాక్స్ మీరు ఎంత తిన్నా అస్సలు బరువు పెరగరట... Cardamom Benefits: పురుషులకు సంజీవని... రోజూ తింటే ఆ సమస్యలన్నీ మాయం! Health Tips: కొలెస్ట్రాల్‌కి టాబ్లెట్ వద్దు.. రోజుకు ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగితే చాలు! Ebola: భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. ప్రజలు ఆందోళన చెందొద్దు.. కేంద్రం భరోసా! Fatty Liver: తల్లిదండ్రులకు అలర్ట్... పిల్లల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్! Cooking oil: వంట నూనె డబ్బా తెరిచాక ఎన్ని రోజులు వాడొచ్చు? అసలు నిజాలు ఇవే! Health Tips: పదే పదే టీ వేడి చేసి తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే! Yogandhra: ‘యోగాంధ్ర-2026’కు ఏపీ సిద్ధం.. రాష్ట్రవ్యాప్తంగా భారీ యోగా వేడుకలు! Health tips: ఉడకబెట్టిన గుడ్డు వర్సెస్ ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్? Vitamin B12: మన బాడీలో ఇది తగ్గినా, పెరిగినా క్యాన్సర్ వస్తుందంట! Healthy Food: ఈ 10 రకాల స్నాక్స్ మీరు ఎంత తిన్నా అస్సలు బరువు పెరగరట... Cardamom Benefits: పురుషులకు సంజీవని... రోజూ తింటే ఆ సమస్యలన్నీ మాయం! Health Tips: కొలెస్ట్రాల్‌కి టాబ్లెట్ వద్దు.. రోజుకు ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగితే చాలు! Ebola: భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. ప్రజలు ఆందోళన చెందొద్దు.. కేంద్రం భరోసా! Fatty Liver: తల్లిదండ్రులకు అలర్ట్... పిల్లల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్!

Walking: రోజుకు ఎన్ని నిమిషాలు నడిస్తే మంచిది... నిపుణుల హెచ్చరిక!

నడక ఆరోగ్యానికి ఉత్తమమైన శారీరక వ్యాయామంగా వైద్యులు చెబుతూ ఉంటారు. అది మానసిక శాంతిని అందించడమే కాకుండా, గుండె ఆరోగ్యం, బరువు నియంత్రణ, షుగర్ లెవల్స్ వంటి అనేక

Published : 2025-07-29 10:29:00

నడక ఆరోగ్యానికి ఉత్తమమైన శారీరక వ్యాయామంగా వైద్యులు చెబుతూ ఉంటారు. అది మానసిక శాంతిని అందించడమే కాకుండా, గుండె ఆరోగ్యం, బరువు నియంత్రణ, షుగర్ లెవల్స్ వంటి అనేక అంశాల్లో సహాయపడుతుంది. అయితే రోజుకు ఎంతసేపు నడవాలన్నదే చాలా మందికి సందేహంగా ఉంటుంది. దీనిపై తాజా పరిశోధనలు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాయి.

వైద్య నిపుణుల సూచనల ప్రకారం, రోజుకు కనీసం 10 నిమిషాలు వేగంగా నడవడం వల్ల ప్రాణాపాయ ప్రమాదం 7% వరకు తగ్గుతుంది. ఈ సమయాన్ని 20 నిమిషాలకు పెంచితే ఈ రిస్క్ 13% తగ్గుతుందని, 30 నిమిషాల నడకతో అయితే దాదాపు 17% వరకూ ప్రాణాపాయం తగ్గించే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, టైప్-2 షుగర్, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యల బారినపడే అవకాశం కలిగినవారికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

అంతేకాదు, రోజూ 6 వేల నుంచి 8 వేల అడుగుల వరకు నడక చేయడం ద్వారా శరీరానికి మరిన్ని లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది సుమారుగా 30–45 నిమిషాల నడకతో సమానమవుతుంది. సాధ్యమైతే రోజు వారి జీవితంలో నడకను భాగం చేసుకోవడం ద్వారా దైనందిన రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

నడక కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించలేకపోయినా, సాధ్యమైనన్ని సందర్భాల్లో మెట్లను ఎక్కడం, కాస్త దూరం ఉన్న చోటికి నడిచిపోవడం, వాకింగ్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం వంటి మార్గాలను ఆశ్రయించడం ద్వారా వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. చిన్న మార్పులతోనే పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అనే మాటను మరచిపోకండి!

Spotlight

Read More →