Indigestion : అజీర్ణమే అన్ని రోగాలకు మూలం… ఆయుర్వేదం చెప్పిన సులభ పరిష్కారం! Union Budget: Union Budget: ఈసారి బడ్జెట్ ప్రసంగం ఒక విశేషం! విద్యార్థులకు కేంద్రం ప్రత్యేక... Anil Ravipudi: చిరంజీవి సినిమా హిట్ ఎఫెక్ట్.. శ్రీవారిని దర్శించుకున్న అనిల్ రావిపూడి! పిల్లల లంచ్ బాక్స్‌లోకి హెల్తీ ఆప్షన్... రుచికరమైన జొన్న మసాలా పరాటా! Vijay–Rashmika: విజయ్–రష్మిక పెళ్లి నిజమేనా..? ఉదయ్‌పూర్ ప్యాలెస్ వీడియోలు వైరల్..! రామ్ చరణ్–ఉపాసనలకు కవల పిల్లలు! మెగా కుటుంబంలో డబుల్ సెలబ్రేషన్! చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్... నేడు కేంద్ర బడ్జెట్ 2026-27 ! AP POLITICS: వైసీపీ కి షాక్.. అంబటి అరెస్ట్…! గుంటూరులో హైటెన్షన్..! 3 ట్రిలియన్ డాలర్ల అరబ్ మార్కెట్ పై భారత్ గురి! Gas Cylinder: బడ్జెట్ ముందు వ్యాపారులకు షాక్..! కమర్షియల్ ఎల్‌పీజీ ధరల పెంపు! Indigestion : అజీర్ణమే అన్ని రోగాలకు మూలం… ఆయుర్వేదం చెప్పిన సులభ పరిష్కారం! Union Budget: Union Budget: ఈసారి బడ్జెట్ ప్రసంగం ఒక విశేషం! విద్యార్థులకు కేంద్రం ప్రత్యేక... Anil Ravipudi: చిరంజీవి సినిమా హిట్ ఎఫెక్ట్.. శ్రీవారిని దర్శించుకున్న అనిల్ రావిపూడి! పిల్లల లంచ్ బాక్స్‌లోకి హెల్తీ ఆప్షన్... రుచికరమైన జొన్న మసాలా పరాటా! Vijay–Rashmika: విజయ్–రష్మిక పెళ్లి నిజమేనా..? ఉదయ్‌పూర్ ప్యాలెస్ వీడియోలు వైరల్..! రామ్ చరణ్–ఉపాసనలకు కవల పిల్లలు! మెగా కుటుంబంలో డబుల్ సెలబ్రేషన్! చరిత్ర సృష్టించనున్న నిర్మలా సీతారామన్... నేడు కేంద్ర బడ్జెట్ 2026-27 ! AP POLITICS: వైసీపీ కి షాక్.. అంబటి అరెస్ట్…! గుంటూరులో హైటెన్షన్..! 3 ట్రిలియన్ డాలర్ల అరబ్ మార్కెట్ పై భారత్ గురి! Gas Cylinder: బడ్జెట్ ముందు వ్యాపారులకు షాక్..! కమర్షియల్ ఎల్‌పీజీ ధరల పెంపు!

Vijay–Rashmika: విజయ్–రష్మిక పెళ్లి నిజమేనా..? ఉదయ్‌పూర్ ప్యాలెస్ వీడియోలు వైరల్..!

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లిపై మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫిబ్రవరి 26న వివాహమంటూ ప్రచారం జోరందుకుంది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు.

Published : 2026-02-01 09:30:00

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక మందన్న వివాహంపై మరోసారి గట్టిగానే ప్రచారం జరుగుతోంది. గత కొద్దికాలంగా ఈ జంట ప్రేమ, పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తాజాగా ఫిబ్రవరి 26న వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. రాజస్థాన్‌లోని ప్రసిద్ధ పర్యాటక నగరం ఉదయ్‌పూర్‌లో ఈ వివాహ వేడుక జరగనున్నట్లు, అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా గతేడాది అక్టోబర్‌లోనే వీరి నిశ్చితార్థం జరిగిపోయిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అక్టోబర్ 3న హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థ కార్యక్రమం జరిగిందని సమాచారం. అయితే ఈ విషయాన్ని విజయ్ గానీ, రష్మిక గానీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. పెళ్లి కోసం ఉదయ్‌పూర్‌లోని ఓ హెరిటేజ్ ప్యాలెస్‌ను ఎంపిక చేసుకున్నారని, నిశ్చితార్థంలాగే పెళ్లిని కూడా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సింపుల్‌గా నిర్వహించాలని ఈ జంట భావిస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. పెళ్లి అనంతరం హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఉండొచ్చని కూడా ప్రచారం సాగుతోంది.

గత 24 గంటల్లో ఈ పెళ్లి వార్తలు మరింత వేగంగా వైరల్ అవుతున్నాయి. ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో పెళ్లికి సంబంధించిన డెకరేషన్ పనులు జరుగుతున్నాయంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలు నిజమా కాదా అనే విషయంపై స్పష్టత లేకపోయినా, అభిమానుల్లో మాత్రం ఉత్కంఠ మరింత పెరిగింది. కొందరు ఫిబ్రవరి 2న పెళ్లి జరుగుతుందని చెబుతుంటే, మరికొందరు ప్రముఖ మీడియా కథనాలను ఉటంకిస్తూ ఫిబ్రవరి 26నే ఖరారైన తేదీగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఏది నిజమో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే, ఈ మొత్తం ప్రచారంపై ఇప్పటివరకు విజయ్ దేవరకొండ గానీ, రష్మిక మందన్న గానీ అధికారికంగా స్పందించలేదు. గతంలో పెళ్లి పుకార్లపై ప్రశ్నించగా, సమయం వచ్చినప్పుడు తానే అన్నీ చెబుతానని రష్మిక తెలివిగా సమాధానం ఇచ్చారు. ఇటీవల ఎయిర్‌పోర్టులో ఇదే అంశంపై అడిగినప్పుడు ఆమె నవ్వుతూ తప్పించుకున్నారు. ఇటీవలే ఈ జంట ఇటలీలో న్యూ ఇయర్ వెకేషన్‌ను కలిసి జరుపుకుని హైదరాబాద్‌కు తిరిగిరావడం కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ప్రస్తుతం రష్మిక ‘కాక్‌టెయిల్ 2’ సినిమా షూటింగ్ పూర్తి చేయగా, విజయ్ తన తదుపరి ప్రాజెక్టులపై బిజీగా ఉన్నారు. ఈ పెళ్లి వార్తలపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Spotlight

Read More →