నిద్ర మధ్యలో మెలకువ వస్తే మళ్లీ నిద్రపోవడం ఎలా…
ప్రశాంతమైన నిద్ర కోసం డాక్టర్లు సూచించే చిట్కాలు..
నిద్ర లేమి సమస్యకు స్వస్తి…
రాత్రిపూట నిద్ర మధ్యలో మెలకువ రావడం, ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా మళ్లీ నిద్ర పట్టకపోవడం అనేది చాలా మంది ఎదుర్కొనే సమస్య. ఇలాంటప్పుడు ఇంటర్నెట్‌లో కనుగుడ్లను లోపలే అటు ఇటు తిప్పే 'ఐ బాల్ మూవింగ్ మెథడ్' (Eye Ball Moving Method) ప్రాచుర్యంలో ఉంది. ఈ పద్ధతి ద్వారా 'వేగల్ నరాల' స్టిములేషన్ జరుగుతుందని, తద్వారా నిద్ర పడుతుందని కొందరు చెబుతుంటారు. అయితే, ఈ పద్ధతికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు (Scientific Evidence) లేవు అని నిపుణులు చెబుతున్నారు.
మనం నిద్రపోకుండా ఉండటానికి ప్రధాన కారణం మన మెదడు చేసే ఆలోచనలు. మనం గతం గురించి ఆలోచిస్తున్నా లేదా భవిష్యత్తు గురించి ప్రణాళికలు (Planning) వేస్తున్నా, మెదడు చురుగ్గా ఉండి నిద్రను రానివ్వదు. నిద్ర అనేది ఒక స్విచ్ లాంటిది; మెదడు విశ్లేషణలు చేయడం ఆపినప్పుడే ఆ స్విచ్ ఆన్ అవుతుంది. కాబట్టి, మెదడును ఆ విశ్లేషణాత్మక ఆలోచనల నుండి దారి మళ్లించడం చాలా ముఖ్యం.
దీని కోసం డాక్టర్ లక్ బిడోయిన్ అనే నిపుణుడు 'కాగ్నిటివ్ షఫ్లింగ్' (Cognitive Shuffling) లేదా 'సీరియల్ డైవర్స్ ఇమేజింగ్' అనే అద్భుతమైన పద్ధతిని కనిపెట్టారు. ఈ పద్ధతిలో మనం మెదడుకు కొన్ని అసంబద్ధమైన, రాండమ్ చిత్రాలను (Random Images) అందించాలి. ఇలా చేయడం వల్ల మెదడు ప్లానింగ్ మోడ్ నుండి రిలాక్సేషన్ మోడ్‌లోకి వెళ్లి నిద్ర పట్టే అవకాశం పెరుగుతుంది.
ఈ పద్ధతిని 'వర్డ్ మెథడ్' ద్వారా సులభంగా చేయవచ్చు. ఉదాహరణకు, మీరు మనసులో 'DUSTER' అనే పదాన్ని అనుకున్నారనుకోండి, అందులోని మొదటి అక్షరం 'D' తో మొదలయ్యే వస్తువులను ఊహించుకోవాలి (ఉదాహరణకు: Dog, Drum, Doll). ఆ చిత్రాలను కొద్దిసేపు విజువలైజ్ చేసిన తర్వాత, రెండో అక్షరం 'U' కి వెళ్లి (ఉదాహరణకు: Umbrella) చిత్రాలను ఊహించుకోవాలి. ఇలా ఒక్కో అక్షరంతో సంబంధం లేని చిత్రాలను మారుస్తూ ఉంటే, మెదడు త్వరగా నిద్రలోకి జారుకుంటుంది.
ఇవే కాకుండా మెడిటేషన్ (ధ్యానం) కూడా నిద్ర పట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మెడిటేషన్ టెక్నిక్స్ పాటించడం వల్ల మనసు నిమ్మళిస్తుంది. ఆరోగ్యకరమైన జీవితానికి నిద్ర చాలా అవసరం, కాబట్టి నిద్ర పట్టనప్పుడు ఈ శాస్త్రీయమైన పద్ధతులను అనుసరించి హాయిగా నిద్రపోండి.