Samsung Galaxy: శాంసంగ్ కీలక నిర్ణయం.. ఆ పాపులర్ ఫోన్‌లకు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ బంద్! South Central Railway: రైల్వే ప్రయాణికులకు షాక్.. సికింద్రాబాద్, విజయవాడ రూట్లలో 8 రైళ్లు రద్దు! Second vehicle: సెకండ్ వెహికల్ కొనుగోలుదారులకు శుభవార్త.. త్వరలో కొత్త ఉత్తర్వులు! Upma recipe: పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టపడే ఫంక్షన్ స్టైల్.. ఉప్మా రెసిపీ! Rare Earth Minerals: ఆ ప్రాంతాల వారికి గుడ్ న్యూస్.. ఖరీదైన రేర్ ఎర్త్ నిక్షేపాలు..!! TTD: తిరుమలలో సంప్రదాయబద్ధంగా బాధ్యతలు.. టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర! Indian teacher: ఇండియన్ టీచర్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు... రూ.9 కోట్ల గ్లోబల్ టీచర్ ప్రైజ్! Benefits walking for brain: నడకతో జ్ఞాపకశక్తి పెరుగుతుందా? నిపుణులు చెబుతున్న అసలు నిజాలివే..!! వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్..! స్పెషల్ ఫీచర్లు ఇవే! Crypto investors: క్రిప్టో ఇన్వెస్టర్లకు షాక్.. రోజురోజుకూ దిగజారుతున్న బిట్కాయిన్ విలువ! Samsung Galaxy: శాంసంగ్ కీలక నిర్ణయం.. ఆ పాపులర్ ఫోన్‌లకు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ బంద్! South Central Railway: రైల్వే ప్రయాణికులకు షాక్.. సికింద్రాబాద్, విజయవాడ రూట్లలో 8 రైళ్లు రద్దు! Second vehicle: సెకండ్ వెహికల్ కొనుగోలుదారులకు శుభవార్త.. త్వరలో కొత్త ఉత్తర్వులు! Upma recipe: పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టపడే ఫంక్షన్ స్టైల్.. ఉప్మా రెసిపీ! Rare Earth Minerals: ఆ ప్రాంతాల వారికి గుడ్ న్యూస్.. ఖరీదైన రేర్ ఎర్త్ నిక్షేపాలు..!! TTD: తిరుమలలో సంప్రదాయబద్ధంగా బాధ్యతలు.. టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర! Indian teacher: ఇండియన్ టీచర్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు... రూ.9 కోట్ల గ్లోబల్ టీచర్ ప్రైజ్! Benefits walking for brain: నడకతో జ్ఞాపకశక్తి పెరుగుతుందా? నిపుణులు చెబుతున్న అసలు నిజాలివే..!! వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్..! స్పెషల్ ఫీచర్లు ఇవే! Crypto investors: క్రిప్టో ఇన్వెస్టర్లకు షాక్.. రోజురోజుకూ దిగజారుతున్న బిట్కాయిన్ విలువ!

Samsung Galaxy: శాంసంగ్ కీలక నిర్ణయం.. ఆ పాపులర్ ఫోన్‌లకు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ బంద్!

శాంసంగ్ గెలాక్సీ S21 సిరీస్‌కు సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌ను కంపెనీ నిలిపివేసింది. దీనివల్ల కలిగే భద్రతా లోపాలు మరియు యూజర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Published : 2026-02-06 20:52:00

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఇదొక చేదు వార్త అదే చెప్పుకోవాలి కంపెనీ తన ప్రతిష్టాత్మక 'గెలాక్సీ S21' సిరీస్‌ను అధికారిక అప్‌డేట్ జాబితా నుండి తొలగించింది. 2021లో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ మోడల్స్, అప్పట్లో అత్యుత్తమ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకున్నాయి. అయితే, టెక్నాలజీ మారుతున్న కొద్దీ పాత మోడళ్లకు స్వస్తి చెప్పే క్రమంలో శాంసంగ్ ఈ నిర్ణయం తీసుకుంది.

గెలాక్సీ S21 సిరీస్ ఆండ్రాయిడ్ 11 వెర్షన్‌తో లాంచ్ అయ్యింది. అప్పట్లో శాంసంగ్ ప్రకటించిన అప్‌డేట్ పాలసీ ప్రకారం ఈ ఫోన్‌లకు నిర్ణీత కాలం పాటు సాఫ్ట్‌వేర్ మరియు సెక్యూరిటీ సపోర్ట్ లభించింది. అయితే, ప్రస్తుతం ఈ సిరీస్‌కు సంబంధించి ఎటువంటి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (OS) అప్‌డేట్లు లేదా క్వార్టర్లీ సెక్యూరిటీ ప్యాచ్‌లు అందవు. గతేడాది నుండే ఈ ఫోన్‌లకు కొత్త ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్‌ను కంపెనీ నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా, క్వార్టర్లీ అప్‌డేట్ లిస్ట్ నుండి కూడా ఈ డివైజ్‌లను తొలగించడంతో ఈ సిరీస్ సపోర్ట్ సైకిల్ అధికారికంగా ముగిసినట్లయింది.

సాధారణంగా ఏదైనా స్మార్ట్‌ఫోన్‌కు సెక్యూరిటీ అప్‌డేట్లు నిలిచిపోయాయంటే, ఆ ఫోన్ సైబర్ దాడులకు సులభంగా గురయ్యే అవకాశం ఉందని అర్థం. సెక్యూరిటీ ప్యాచ్‌లు అనేవి హ్యాకర్లు కనుగొనే కొత్త లూప్‌హోల్స్ (Lopholes) నుండి ఫోన్‌ను రక్షిస్తాయి. ఇప్పుడు S21 సిరీస్ యూజర్లు అప్‌డేట్లు లేకపోవడం వల్ల ఆన్‌లైన్ మోసాలకు, మాల్వేర్ దాడులకు గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్ యాప్స్ వాడేవారు మరియు వ్యక్తిగత డేటాను ఫోన్లలో భద్రపరుచుకునే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

గెలాక్సీ S21 సిరీస్ అనేది తక్కువ అప్‌డేట్ సైకిల్ (4 ఏళ్లు) కలిగిన చివరి ఫ్లాగ్‌షిప్ సిరీస్‌గా మిగిలిపోనుంది. ఎందుకంటే, శాంసంగ్ తన ప్రస్తుత కొత్త మోడల్స్‌కు (S24 సిరీస్ వంటివి) ఏకంగా ఏడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ మరియు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను ఇస్తామని హామీ ఇచ్చింది. పాత ఫోన్ల విషయంలో కంపెనీ కఠినంగా వ్యవహరిస్తుండటంతో, టెక్ ప్రియులు కొత్త మోడళ్లకు అప్‌గ్రేడ్ అవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది.

మీరు ఇప్పటికీ గెలాక్సీ S21, S21+ లేదా S21 అల్ట్రా మోడల్స్ వాడుతుంటే, భద్రత దృష్ట్యా కొత్త మోడల్‌కు మారడం ఉత్తమమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ అదే ఫోన్‌ను వాడాలనుకుంటే, థర్డ్ పార్టీ యాప్స్ ఇన్‌స్టాల్ చేయకుండా ఉండటం, తెలియని లింక్‌లను క్లిక్ చేయకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీ డేటా భద్రత కోసం వీలైనంత త్వరగా లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఉన్న గెలాక్సీ S24 లేదా త్వరలో రాబోయే కొత్త సిరీస్ వైపు చూడటం  మంచిదని టెక్ నిపుణులు తెలుపుతున్నారు.  

Spotlight

Read More →