Samsung Galaxy: శాంసంగ్ కీలక నిర్ణయం.. ఆ పాపులర్ ఫోన్‌లకు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ బంద్! South Central Railway: రైల్వే ప్రయాణికులకు షాక్.. సికింద్రాబాద్, విజయవాడ రూట్లలో 8 రైళ్లు రద్దు! Second vehicle: సెకండ్ వెహికల్ కొనుగోలుదారులకు శుభవార్త.. త్వరలో కొత్త ఉత్తర్వులు! Upma recipe: పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టపడే ఫంక్షన్ స్టైల్.. ఉప్మా రెసిపీ! Rare Earth Minerals: ఆ ప్రాంతాల వారికి గుడ్ న్యూస్.. ఖరీదైన రేర్ ఎర్త్ నిక్షేపాలు..!! TTD: తిరుమలలో సంప్రదాయబద్ధంగా బాధ్యతలు.. టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర! Indian teacher: ఇండియన్ టీచర్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు... రూ.9 కోట్ల గ్లోబల్ టీచర్ ప్రైజ్! Benefits walking for brain: నడకతో జ్ఞాపకశక్తి పెరుగుతుందా? నిపుణులు చెబుతున్న అసలు నిజాలివే..!! వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్..! స్పెషల్ ఫీచర్లు ఇవే! Crypto investors: క్రిప్టో ఇన్వెస్టర్లకు షాక్.. రోజురోజుకూ దిగజారుతున్న బిట్కాయిన్ విలువ! Samsung Galaxy: శాంసంగ్ కీలక నిర్ణయం.. ఆ పాపులర్ ఫోన్‌లకు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ బంద్! South Central Railway: రైల్వే ప్రయాణికులకు షాక్.. సికింద్రాబాద్, విజయవాడ రూట్లలో 8 రైళ్లు రద్దు! Second vehicle: సెకండ్ వెహికల్ కొనుగోలుదారులకు శుభవార్త.. త్వరలో కొత్త ఉత్తర్వులు! Upma recipe: పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టపడే ఫంక్షన్ స్టైల్.. ఉప్మా రెసిపీ! Rare Earth Minerals: ఆ ప్రాంతాల వారికి గుడ్ న్యూస్.. ఖరీదైన రేర్ ఎర్త్ నిక్షేపాలు..!! TTD: తిరుమలలో సంప్రదాయబద్ధంగా బాధ్యతలు.. టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర! Indian teacher: ఇండియన్ టీచర్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు... రూ.9 కోట్ల గ్లోబల్ టీచర్ ప్రైజ్! Benefits walking for brain: నడకతో జ్ఞాపకశక్తి పెరుగుతుందా? నిపుణులు చెబుతున్న అసలు నిజాలివే..!! వందే భారత్ స్లీపర్ రైళ్లపై మరో బిగ్ అప్డేట్..! స్పెషల్ ఫీచర్లు ఇవే! Crypto investors: క్రిప్టో ఇన్వెస్టర్లకు షాక్.. రోజురోజుకూ దిగజారుతున్న బిట్కాయిన్ విలువ!

కేజీబీవీ టీచర్ల కేసులో ట్విస్ట్..! విద్యాశాఖ అధికారులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

కేజీబీవీ పార్ట్‌టైమ్ పీజీటీ టీచర్ల తొలగింపుల కేసులో కీలక మలుపు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన విద్యాశాఖ అధికారులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Published : 2026-02-06 09:23:00


ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారుల తీరుపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని న్యాయస్థానం మండిపడింది. ముఖ్యంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న పార్ట్-టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ) తమను మధ్యలోనే తొలగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యాశాఖలో ఏదో తప్పు జరుగుతోందని, అధికారుల తీరు అనుమానాస్పదంగా ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఈ వివాదం 2023లో ప్రారంభమైంది. తమను అర్ధాంతరంగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ పీజీటీలు కోర్టును ఆశ్రయించగా, వారిని విధుల్లో కొనసాగించాలని సింగిల్ జడ్జి బెంచ్ అప్పట్లో ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పుపై ఉన్నతాధికారులు అప్పీల్ చేసినప్పటికీ, కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది గత విచారణలో కోర్టుకు హామీ ఇచ్చారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని న్యాయస్థానం గుర్తించింది. అధికారుల మధ్య సమన్వయం లోపించిందని మరియు కోర్టుకు ఇచ్చిన హామీలను వారు తుంగలో తొక్కుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది.

ప్రభుత్వ న్యాయవాది ఇచ్చిన హామీకి విరుద్ధంగా విజయనగరం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) వ్యవహరించారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అక్కడ పనిచేస్తున్న పీజీటీలను ఇతర స్థానాలకు బదిలీ చేయడమే కాకుండా, వారికి ఇవ్వాల్సిన నిర్ణీత జీతానికి బదులుగా గంటల లెక్కన వేతనం చెల్లిస్తున్నారని వాదించారు. ఇది కోర్టు ఆదేశాలను స్పష్టంగా ధిక్కరించడమేనని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కింది స్థాయి సిబ్బంది కూడా కోర్టు ఆదేశాలను మరియు ఉన్నతాధికారులు ఇచ్చే హామీలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని ధర్మాసనం మండిపడింది.

విద్యాశాఖలోని ఉన్నతాధికారులు తాము ఏదో పవర్ ఫుల్ వ్యక్తుల కింద పనిచేస్తున్నామని, తమను ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారంతో ఉన్నారని హైకోర్టు ఘాటుగా విమర్శించింది. కోర్టు ఆదేశాలకు కనీస మర్యాద ఇవ్వకపోవడంపై జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అధికారుల ఆలోచనా ధోరణి ఇలాగే ఉంటే వారిని ఎలా డీల్ చేయాలో తమకు తెలుసునని హెచ్చరించింది. మీరు న్యాయస్థానంతో ఘర్షణ పడాలని చూస్తున్నారా అని అధికారులను నిలదీసింది.

ఈ క్రమంలో రాష్ట్ర సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) బి. శ్రీనివాసరావుపై హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాకుండా, అవి క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కూడా ఉన్నతాధికారులదేనని స్పష్టం చేసింది. విజయనగరం పీడీ చేసిన తప్పులకు రాష్ట్ర స్థాయి అధికారిని బాధ్యుడిని చేస్తూ, ఫిబ్రవరి 4వ తేదీన ఆయనను స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. విద్యాశాఖలో జరుగుతున్న లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం గట్టిగా హెచ్చరించింది.
 

Spotlight

Read More →