Middle East Conflict: అతలాకుతలమైన లెబనాన్.. ఇజ్రాయెల్ దాడుల్లో వందల సంఖ్యలో మృతులు.!! Kalburgi rottelu: కల్బుర్గి రొట్టెలు రుచితో పాటు ఆరోగ్యాన్ని పంచే ఉత్తర కర్ణాటక స్పెషల్.. ఈ రొట్టెల వెనక కథ ఏంటి.? Chocolate Town Of India: ఇండియాలో ఉత్తమమైన చాక్లెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బ్రిటీష్ కాలం నాటి చాక్లెట్ సిటీ.. highspeed trains night: టెక్నికల్ రీజన్స్ vs మైండ్ గేమ్: రాత్రి పూట రైలు ప్రయాణంలో కలిగే ఆ త్రిల్లింగ్ అనుభూతి వెనుక సైన్స్.. Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Amazon Layoffs: అమేజాన్ ఉద్యోగుల్లో మళ్లీ మొదలైన టెన్షన్.. వచ్చే నెలలో 14,000 మందిపై వేటు? Techie Trekking: ట్రెకింగ్ అని వెళ్ళి.. అదృశ్యమై.. తిరిగి వచ్చి.... పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు! Iran War: విశాఖలో ఇరాన్ యువతుల గోడు! మా దేశం వెళ్ళిపోతాం.. దయచేసి మమ్మల్ని మా వారితో చేర్చండి.. Chandrababu Master Plan: పోర్టులే ఆర్థిక ఇంజిన్లు... ఏపీ తీరప్రాంతం వెంబడి భారీ హైవేల నెట్‌వర్క్ - సీఎం చంద్రబాబు! AP Govt: అన్నవరం, ద్వారకా తిరుమలకు కొత్త వెలుగులు.. నూతన పాలక మండలి సభ్యుల నియామకం! 34 మందితో కొత్త బోర్డు.. Middle East Conflict: అతలాకుతలమైన లెబనాన్.. ఇజ్రాయెల్ దాడుల్లో వందల సంఖ్యలో మృతులు.!! Kalburgi rottelu: కల్బుర్గి రొట్టెలు రుచితో పాటు ఆరోగ్యాన్ని పంచే ఉత్తర కర్ణాటక స్పెషల్.. ఈ రొట్టెల వెనక కథ ఏంటి.? Chocolate Town Of India: ఇండియాలో ఉత్తమమైన చాక్లెట్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? బ్రిటీష్ కాలం నాటి చాక్లెట్ సిటీ.. highspeed trains night: టెక్నికల్ రీజన్స్ vs మైండ్ గేమ్: రాత్రి పూట రైలు ప్రయాణంలో కలిగే ఆ త్రిల్లింగ్ అనుభూతి వెనుక సైన్స్.. Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Amazon Layoffs: అమేజాన్ ఉద్యోగుల్లో మళ్లీ మొదలైన టెన్షన్.. వచ్చే నెలలో 14,000 మందిపై వేటు? Techie Trekking: ట్రెకింగ్ అని వెళ్ళి.. అదృశ్యమై.. తిరిగి వచ్చి.... పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు! Iran War: విశాఖలో ఇరాన్ యువతుల గోడు! మా దేశం వెళ్ళిపోతాం.. దయచేసి మమ్మల్ని మా వారితో చేర్చండి.. Chandrababu Master Plan: పోర్టులే ఆర్థిక ఇంజిన్లు... ఏపీ తీరప్రాంతం వెంబడి భారీ హైవేల నెట్‌వర్క్ - సీఎం చంద్రబాబు! AP Govt: అన్నవరం, ద్వారకా తిరుమలకు కొత్త వెలుగులు.. నూతన పాలక మండలి సభ్యుల నియామకం! 34 మందితో కొత్త బోర్డు..

Central Secretariat: అమరావతికి కేంద్రం భారీ కానుక.. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!

Central Secretariat: అమరావతిలో రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ మరియు కేంద్ర ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ సిద్ధమైంది. సీఆర్డీఏ కేటాయించిన 22.53 ఎకరాల్లో ఈ అత్యాధునిక భవనాలు నిర్మించనున్నారు.

Published : 2026-04-08 19:00:00

Politics- అమరావతిలో మినీ ఢిల్లీ…

సీఆర్డీఏ కేటాయించిన 22 ఎకరాల్లో సెంట్రల్ సెక్రటేరియట్…..

కేంద్ర మంత్రి పెమ్మసాని చొరవ..

Central Secretariat: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మంజూరు చేసింది. రాజధాని ప్రాంతంలో 'కామన్ సెంట్రల్ సెక్రటేరియట్' మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణానికి సంబంధించి రూ. 2,534 కోట్లతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధమైంది. కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ సిద్ధం చేసిన ఈ ప్రతిపాదిత నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ఆమోదించారు. ప్రస్తుతం ఈ డీపీఆర్ కేంద్ర కేబినెట్ తుది ఆమోదం కోసం వేచి చూస్తోంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ప్రాజెక్టు మంజూరు కోసం అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి దీనిని పట్టాలెక్కించారు.

భారీ ప్రాజెక్టును ప్రధానంగా రెండు భాగాలుగా విభజించారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం నిర్మించే కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనానికి రూ. 1,299.08 కోట్లు ఖర్చు చేయనుండగా, ఇక్కడ పనిచేసే ఉద్యోగుల నివాస గృహాల కోసం మరో రూ. 1,234.91 కోట్లు కేటాయించారు. ఈ నిర్మాణాల కోసం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) ఇప్పటికే సుమారు 22.53 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో 5.53 ఎకరాల్లో సెక్రటేరియట్ భవనం, మిగిలిన 17 ఎకరాల్లో బహుళ అంతస్తుల నివాస సముదాయాలు కొలువుదీరనున్నాయి. అమరావతి కేంద్రంగా పనిచేసే అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా ఈ కామన్ సెక్రటేరియట్ ను డిజైన్ చేశారు.

కేంద్ర సెక్రటేరియట్ నిర్మాణంతో పాటు అమరావతిలో మరిన్ని అంతర్జాతీయ స్థాయి వసతులు రానున్నాయి. హుడ్‌కో (HUDCO) సంస్థ సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే అమరావతికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కడంతో పాటు, పరిపాలనా పరంగా రాజధాని నగరం మరింత బలోపేతం కానుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో అమరావతి నిర్మాణ పనుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. త్వరలోనే ఈ నిర్మాణాలకు శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Spotlight

Read More →