IMD Alert: రాబోయే 24 గంటలు కీలకం.. ఏపీ వాతావరణంపై ఐఎండీ తాజా అప్‌డేట్! Fire Accident: రాజధానిలో కలకలం... సచివాలయ సమీపంలో భారీ అగ్నిప్రమాదం! Tiger Hunt: మళ్ళీ పులి కలకలం.. భయాందోళనలో స్థానిక గ్రామాలు! ఆ ప్రాంతాలకు రెడ్ అలెర్ట్... Himachal Pradesh Geography: హిమాచల్ అంటే మంచు కొండలే కాదు.. దేశానికే పండ్ల భాండాగారం! ఎందుకో తెలుసా? Rain Alert: తెలుగు రాష్ట్రాలకు 'హై అలర్ట్'... రాబోయే మూడు రోజులు బీభత్సమే! Tiger Fear: కాకినాడ జిల్లాలో పులి కలకలం... శంఖవరం, ప్రత్తిపాడు సరిహద్దుల్లో హై అలర్ట్! Tiger hunting: మళ్లీ మొదలైన పులి వేట! భయంతో వణుకుతున్న ఆ గ్రామాలు! Oar Fish: 3,000 అడుగుల లోతు నుండి తీరానికి చేరిన ఓర్ ఫిష్..! శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? Weather Update: విపత్తుల సంస్థ హెచ్చరిక! మార్చి నుంచే భానుడి భగభగలు...! ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత తీవ్రం! Summer Tips: మండిపోతున్న ఎండలు..! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! IMD Alert: రాబోయే 24 గంటలు కీలకం.. ఏపీ వాతావరణంపై ఐఎండీ తాజా అప్‌డేట్! Fire Accident: రాజధానిలో కలకలం... సచివాలయ సమీపంలో భారీ అగ్నిప్రమాదం! Tiger Hunt: మళ్ళీ పులి కలకలం.. భయాందోళనలో స్థానిక గ్రామాలు! ఆ ప్రాంతాలకు రెడ్ అలెర్ట్... Himachal Pradesh Geography: హిమాచల్ అంటే మంచు కొండలే కాదు.. దేశానికే పండ్ల భాండాగారం! ఎందుకో తెలుసా? Rain Alert: తెలుగు రాష్ట్రాలకు 'హై అలర్ట్'... రాబోయే మూడు రోజులు బీభత్సమే! Tiger Fear: కాకినాడ జిల్లాలో పులి కలకలం... శంఖవరం, ప్రత్తిపాడు సరిహద్దుల్లో హై అలర్ట్! Tiger hunting: మళ్లీ మొదలైన పులి వేట! భయంతో వణుకుతున్న ఆ గ్రామాలు! Oar Fish: 3,000 అడుగుల లోతు నుండి తీరానికి చేరిన ఓర్ ఫిష్..! శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? Weather Update: విపత్తుల సంస్థ హెచ్చరిక! మార్చి నుంచే భానుడి భగభగలు...! ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత తీవ్రం! Summer Tips: మండిపోతున్న ఎండలు..! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

IMD Alert: బంగాళాఖాతం అల్పపీడనం! ఏపీలో పలు జిల్లాలకు 'ఫ్లాష్ ఫ్లడ్' ముప్పు..!

 బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో కుప్పకూలే వర్షాలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో పలు జ

Published : 2025-08-14 16:59:00

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో కుప్పకూలే వర్షాలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో పలు జిల్లాల్లో ప్రజా జీవనం స్తంభించిపోగా, రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) సంభవించే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిస్తోంది.

ప్రధానంగా తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి మరియు యానాం ప్రాంతాల్లో ముప్పు ఎక్కువగా ఉందని తెలిపిన ఐఎండీ అధికారులు, రాష్ట్ర అత్యవసర సేవల యంత్రాంగానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద నీరు భారీగా చేరడం వల్ల, విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం 4 లక్షల క్యూసెక్కులు దాటింది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాలు, లంక గ్రామాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. ఎవరూ వరద నీటిలో ఈతకు వెళ్ళవద్దు, చేపల వేట కోసం నదిలోకి ప్రవేశించవద్దు, నాటు పడవలపై ప్రయాణాలు కూడా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.

ముందుజాగ్రత్త చర్యలుగా కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో ప్రమాద సూచికలు ఏర్పాటు చేశారు.

ప్రస్తుత అల్పపీడనం శుక్రవారానికి మరింత బలపడి పశ్చిమవాయువ్య దిశగా ఉత్తరాంధ్ర-ఒడిశా వైపు కదిలే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. గురువారం నాడు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, విజయనగరం, నంద్యాల, పల్నాడు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.

Spotlight

Read More →