భారత స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్‌పై గత కొన్ని నెలలుగా అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రిస్క్ ఎక్కువ ఉండటం, రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోవడం వంటి కారణాలతో ఫ్యూచర్స్ & ఆప్షన్స్ వ్యవస్థను ప్రభుత్వం కట్టడి చేస్తుందా? లేదా పూర్తిగా నిలిపివేస్తుందా? అన్న చర్చలపై స్పష్టత ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
ఢిల్లీ లో జరిగిన ఒక ఫైనాన్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ సర్కారు ఇన్వెస్టర్ల అవకాశాలను తగ్గించడానికి కాదు, అవకాశాలను పెంచడానికి పనిచేస్తుంది. మార్కెట్‌పై తలుపులు మూసి వేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు అని స్పష్టం చేశారు. మార్కెట్‌లో ఉన్న ప్రతి వ్యవస్థకు పర్యవేక్షణ తప్పనిసరి అయినా దానిని ఆపేయాలనే ఆలోచన అస్సలు లేదని ఆమె అన్నారు.
సీతారామన్ ఇన్వెస్టర్లు ప్రమాదాన్ని అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం చేయగలిగేది మార్గదర్శకత్వం, నియంత్రణ మరియు అవగాహన. ట్రేడింగ్ చేయాలా చేయకూడదా అన్నది వ్యక్తిగత ఎంపిక అని అన్నారు.
F&O మీద ఎందుకు చర్చ మొదలైంది?
ఇటీవల కొన్ని నివేదికల్లో రిటైల్ ఇన్వెస్టర్లలో చాలా మంది F&O ట్రేడింగ్ ద్వారా నష్టాలు చవి చూస్తున్నారని వెల్లడైంది. ప్రత్యేకించి కొత్తగా మార్కెట్‌లోకి వచ్చే యువ ఇన్వెస్టర్లు త్వరగా లాభాలు సంపాదించాలని ప్రయత్నిస్తూ పెద్ద మొత్తాలు కోల్పోతున్నారని SEBI డేటా చూపిస్తుంది. ఈ నేపథ్యంలో F&O ను పరిమితం చేసే అవకాశంపై చర్చ ఆరంభమైంది.
అయితే కేంద్ర ఆర్థిక మంత్రి వివరణతో ఆ అనుమానాలకు తెరదించబడింది. ప్రభుత్వం దృష్టి నియంత్రణలో సంస్కరణలు, మార్కెట్‌కు ఆటంకం కాదు ప్రభుత్వం తీసుకునే చర్యలు కొన్ని ముఖ్య లక్ష్యాల చుట్టూ తిరుగుతాయి మార్కెట్‌లో పారదర్శకత పెంపు
రిస్క్ మేనేజ్‌మెంట్ పటిష్టం ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మరియు అవగాహన కార్యక్రమాలు
మోసపూరిత కార్యక్రమాలు అరికట్టడం
అవసరం అనిపించినప్పుడు రూల్స్ మార్చినా, ట్రేడింగ్‌ను అడ్డుకోవడం లక్ష్యం కాదని ఆమె స్పష్టం చేశారు.
ఇన్వెస్టర్ల పాత్ర ముఖ్యం
అధిక రిస్క్ ఉన్న మార్కెట్ సెగ్మెంట్లలోకి రావాలంటే ఇన్వెస్టర్లు మార్కెట్‌ను అధ్యయనం చేయాలి ట్రేడింగ్ మెకానిజం అర్థం చేసుకోవాలి భావోద్వేగాలకు లోనుకాకుండా నిర్ణయం తీసుకోవాలి అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని సంస్కరణలు రానున్నాయి
సీతారామన్ మాటల్లో
భారతీయ మార్కెట్ ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతోంది. పెట్టుబడిదారుల రక్షణ, ఆర్థిక వ్యవస్థ బలోపేతం మరియు పారదర్శకత ఇవే ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు.
ఆమె వ్యాఖ్యలతో మార్కెట్‌లో ఉన్న సందేహాలు తొలగిపోయాయి రెగ్యులేటరీ వ్యవస్థతో పాటు ట్రేడింగ్ స్వేచ్ఛ కొనసాగుతుందని స్పష్టమవుతుంది.