తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ పేరు మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం నుంచి ఎంసెట్ పేరును ఈఏపీ సెట్‌గా మార్చాలని సర్కారు డిసైడ్ అయింది .
దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. దీంతో నేడో, రేపో అధికారికంగా దీనిపై జీవో విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు 1984-85 విద్యాసంవత్సరం నుంచి మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ పేరుతో ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తు వస్తున్నారు.
ఆ తర్వాత ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఈఏఎంసెట్(ఎంసెట్)గా మార్చిన సంగతి తెలిసిందే. అయితే 2016-17 నుంచి మెడికల సీట్లకు సంబంధించి జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో అప్పటి నుంచి ఎంసెట్ ను కేవలం ఇంజినీరింగ్, ఫార్మాసీ కోర్సుల ఎంట్రెన్స్ గానే నిర్వహిస్తున్నారు. ఏపీలో మూడు సంవత్సరాల క్రితమే ఎంసెట్ ను ఏపీ ఈఏపీ సెట్ గా మార్చారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
కాని తెలంగాణలో మాత్రం టీఎస్ ఎంసెట్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా రంగం పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే టీఎస్ఎంసెట్పేరును టీఎస్ఈఏపీసెట్గా మార్చాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఈ ప్రతిపాదనలకు సీఎం బుధవారం ఆమోదించారు. రాష్ట్రంలోని వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం స్టేట్‌లో ప్రస్తుతం ఎంసెట్, ఈసెట్, ఐసెట్, ఎడ్ సెట్, లాసెట్, పీజీఎల్‌సెట్, పీజీఈసెట్, పీఈసెట్ తదితర ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
వీటిలో కీలకమైన ఈఏపీసెట్(ఎంసెట్)ను మే 9 లేదా 11 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటి షెడ్యూల్ ను ఇప్పటికే సర్కారు ఆమోదానికి పంపించగా, సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి