టాలీవుడ్ హీరో శర్వానంద్ వ్యక్తిగత జీవితంపై ఇటీవల వచ్చిన విడాకుల వార్తలు అభిమానుల్లో కలకలం రేపాయి. ఆయన భార్య రక్షితతో సంబంధాలు బాగోలేవని, ఇద్దరూ విడిపోయే ఆలోచనలో ఉన్నారని కొన్ని సోషల్ మీడియా పేజీలు ప్రచారం చేశాయి. అయితే ఈ రూమర్స్‌పై శర్వానంద్ ఎటువంటి ప్రత్యక్ష ప్రకటన చేయకపోయినా, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలతో ఆ ఊహాగానాలకు పరోక్షంగా చెక్ పెట్టారు.
శర్వానంద్ మాట్లాడుతూ, తండ్రి అయిన తర్వాత నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు నాకు బాధ్యతలపై అవగాహన ఎక్కువైంది. ముఖ్యంగా ఆరోగ్యంపై కొత్త దృష్టికోణం వచ్చింది. ముందు నేను వర్కౌట్స్ చేయడం అంటే పెద్దగా ఆసక్తి చూపించేవాడిని కాదు. కానీ ఇప్పుడు నా కుటుంబం కోసం ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలని నిర్ణయించుకున్నాను” అని తెలిపారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన తన కుటుంబ జీవితంలో అన్నీ సవ్యంగా ఉన్నాయని క్లియర్‌గా తెలియజేశారు.
అలాగే, 2019లో జరిగిన ప్రమాదం తర్వాత తాను ఎదుర్కొన్న కష్టాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. “ఆ యాక్సిడెంట్ తర్వాత నా బరువు దాదాపు 92 కిలోలకు పెరిగిపోయింది. ఆ పరిస్థితి నుంచి బయటపడటం అంత ఈజీ కాదు. ఫిజికల్‌గా, మెంటల్‌గా బలహీనంగా మారాను. కానీ ధైర్యం కోల్పోలేదు. సిస్టమాటిక్‌గా డైట్, వ్యాయామం, మైండ్ కంట్రోల్‌తో కష్టపడి 22 కిలోలు తగ్గించాను. ఇప్పుడు నా ఫిట్‌నెస్‌పై చాలా కేర్ తీసుకుంటున్నాను” అని చెప్పారు.
శర్వానంద్ ఇటీవలే తండ్రిగా మారిన విషయం తెలిసిందే. ఆయన భార్య రక్షితతో కలిసి కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నారని దగ్గరి వర్గాలు చెబుతున్నాయి. పాప జననం తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత సంతోషంగా మారిందని స్నేహితులు అంటున్నారు. “ఇప్పుడు నా జీవితంలో ప్రాధాన్యతా క్రమం మారింది. నేను చేసే ప్రతి పని నా కుటుంబం కోసం, నా బిడ్డ కోసం. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది” అని శర్వానంద్ భావోద్వేగంగా వెల్లడించారు.
ప్రస్తుతం శర్వానంద్ తన కొత్త సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. హనూ రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రముఖ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ కొత్త లుక్‌తో కనిపించనున్నారు. ఇది నా కెరీర్‌లో స్పెషల్ మూవీ అవుతుంది అని ఆయన చెప్పారు.
శర్వానంద్ మాటలతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. విడాకుల వార్తలు పూర్తిగా అబద్ధం అని ఆయన మాటల ద్వారా స్పష్టమవుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే, పాజిటివ్ వైబ్స్ ఇచ్చే ఈ హీరో తన ఫ్యామిలీతో సంతోషంగా జీవిస్తున్నాడని చెప్పవచ్చు.