తమిళనాడులోని కరూర్ జిల్లా జరిగిన టీవీకే పార్టీ ప్రచార సభలో ఘోరమైన తొక్కిసలాట సంఘటనపై ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు విజయ్ మంగళవారం తన భావాలను ఒక వీడియో ద్వారా పంచుకున్నారు. ఆయన జీవితంలో ఇలాంటి ఘటనను ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆవేదనతో చెప్పారు. తన తప్పేమీ లేకపోయినా ఆ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందని ఆయన తెలిపారు.
వీడియోలో విజయ్ మాట్లాడుతూనా జీవితంలో ఇంత పెద్ద బాధను నేను ఎప్పుడూ చూడలేదు. నా హృదయం బాధతో నిండిపోయింది. ప్రజలు ప్రచార సభలో నన్ను చూడటానికి వచ్చారు. వారిలోని ప్రేమకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారిని చూసి సంతోషంగా ఉన్నా వారి భద్రత విషయంలో ఎలాంటి అవగాహన తప్పనిసరిగా ఉండాలి. రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలు సురక్షితంగా ఉండేలా సభలు ఏర్పాటు చేయాలని నేను పోలీస్ శాఖను కోరడం జరిగిందని చెప్పారు.
గతంలో ఐదు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేశానని చెప్పుకొచ్చారు. అయితే, కరూర్ జిల్లాలోనే ఈ ఘటన ఎందుకు జరిగిందో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజలకు నిజం తెలుసు. వారు ఈ ఘటనలను పరిశీలిస్తున్నారు. నేను కూడా కాస్త ఉద్రిక్త పరిస్థితులు రాకుండా చూసుకోవాలని ఆలోచించి అక్కడ పర్యటించలేదు. త్వరలోనే అక్కడి కుటుంబాల వారిని కలుస్తాను. త్వరలో అన్ని నిజాలు బయటకు వస్తాయి,” అని ఆయన చెప్పడం జరిగింది.
విజయ్ మేము ఎలాంటి తప్పులు చేయలేదు, అయినా పార్టీ నాయకులు, స్నేహితులు, సోషల్ మీడియా వినియోగదారుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ ఘటన వల్ల నా మనసు బాధతో నిండిపోయింది. కానీ ప్రజల ప్రేమ, అభిమానానికి ఎప్పుడూ నేను కృతజ్ఞతలు చెప్పే వాడినని మళ్లీ గుర్తు చేసుకుంటున్నాను. కరూర్ ఘటనపై అన్ని విషయాలు త్వరలో బయటకు వస్తాయని ఆయన తెలపడం జరిగినది.