US Passport: అమెరికా పాస్‌పోర్ట్ ప్రతిష్టకు దెబ్బ..! హెన్లీ ఇండెక్స్‌లో టాప్ 10 జాబితా బయటకు..!

కారు నడుపుతుంటే గేర్లు సరిగ్గా పడకపోవడం, శబ్దం రావడం లేదా రివర్స్ గేర్ వేయడంలో ఇబ్బంది కలగడం వంటి సమస్యలు చాలామందికి ఎదురవుతుంటాయి. ఎక్కువ మంది ఇది పెద్ద సమస్య అని భావించి నేరుగా గ్యారేజీకి తీసుకెళ్తారు. కానీ ప్రతిసారీ గేర్ బాక్స్ సమస్యలకు భారీ రిపేర్ అవసరం ఉండదు. చాలా సందర్భాల్లో గేర్ ఆయిల్ లెవల్ తక్కువగా ఉండటం, లేదా నాసిరకం గేర్ ఆయిల్ వాడటం, అలాగే క్లచ్ సిస్టమ్ లో లోపాలు ఉండటం వంటివి ప్రధాన కారణాలు అవుతాయి. ఈ పరిస్థితుల్లో మీరు కొన్ని బేసిక్ టెక్నిక్స్ పాటిస్తే గేర్ బాక్స్ మళ్లీ సాఫీగా పనిచేస్తుంది.

తేజ్‌ సంబరాల ఏటిగట్టు గ్లింప్స్‌ దుమ్మురేపింది అంటున్న అభిమానులు!!

మీ కారులో గేర్లు సరిగా పనిచేయకపోతే ముందుగా చెక్ చేయాల్సింది గేర్ ఆయిల్ స్థాయి. ఆయిల్ లెవల్ తక్కువగా ఉంటే గేర్‌లు సరిగా పడవు. అలాగే ఆయిల్ ముదురు రంగులోకి మారినా లేదా వాసన మారినా, అది ఆయిల్ పాడైందని సంకేతం. ఈ పరిస్థితిలో వెంటనే కొత్త, నాణ్యమైన ఆయిల్‌తో రీప్లేస్ చేయాలి. గేర్ ఆయిల్ క్వాలిటీ మెరుగుపడితే గేర్ బాక్స్ కూడా మళ్లీ స్మూత్‌గా మారుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఆ జిల్లాలో భారీ పర్యాటక ప్రాజెక్టు ప్రభుత్వం కీలక ఆదేశాలు!!

చాలామందికి రివర్స్ గేర్ వేయడం కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు గేర్ వేయడంలో “క్ర్ర్” అనే శబ్దం వస్తుంది లేదా గేర్ బలంగా వేయాల్సి వస్తుంది. ఇది సాధారణంగా క్లచ్ సిస్టమ్ సరిగా పని చేయకపోవడం వల్ల జరుగుతుంది. రివర్స్ గేర్ వేయడానికి ముందు క్లచ్‌ను పూర్తిగా నొక్కి, న్యూట్రల్‌లో ఉంచి, తర్వాత స్లోగా గేర్ మార్చే ప్రయత్నం చేయాలి. బలవంతంగా గేర్ మార్చడం వల్ల గేర్ బాక్స్ టూత్‌లు దెబ్బతిని, ఎక్కువ ఖర్చు వచ్చే పరిస్థితి తలెత్తుతుంది.

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్!

గేర్ బాక్స్ ఎప్పుడూ మంచి స్థితిలో ఉండాలంటే గేర్ ఆయిల్ లెవల్‌ను తరచుగా చెక్ చేయడం చాలా అవసరం. అలాగే కారు క్లచ్ సిస్టమ్ సరిగా పనిచేస్తుందా అనేది కూడా నిర్ధారించుకోవాలి. క్లచ్ వైర్లు, మూవ్‌మెంట్ స్మూత్‌గా ఉన్నాయా చూడాలి. డ్రైవింగ్ సమయంలో గేర్లు మార్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయిల్, క్లచ్ బాగానే ఉన్నప్పటికీ గేర్ బాక్స్‌లో ఇబ్బంది కొనసాగితే, అది లోపలి మెకానికల్ ఇష్యూ కావచ్చు. అప్పుడు నిపుణుడైన మెకానిక్‌తో కారును చెక్ చేయించడం ఉత్తమం.

AI HUB: విశాఖలో మొట్టమొదటి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్.. CEO సుందర్ పిచాయ్!

చిన్న చిన్న జాగ్రత్తలతో గేర్ బాక్స్ జీవితాన్ని పొడిగించవచ్చు. తక్కువ నాణ్యత గల ఆయిల్ వాడకండి, గేర్ మార్చేటప్పుడు క్లచ్ పూర్తిగా నొక్కండి, అలాగే కారును తరచూ సర్వీస్ చేయించండి. ఇవన్నీ పాటిస్తే పెద్ద సమస్యలు తలెత్తవు. గేర్ బాక్స్ రిపేర్ ఖర్చులు లక్షల్లో ఉంటాయి, కానీ ఈ చిట్కాలు పాటిస్తే మీరు ఆ ఖర్చు తప్పించుకోవచ్చు.

Satellites: భవిష్యత్తులో ఉపగ్రహాలకు స్థలం లేవు..! స్టార్ లింక్ శాటిలైట్‌ల పెరుగుదలపై అంతరిక్ష నిపుణుల హెచ్చరిక!
అగ్రరాజ్యానికి షాక్ - ఒక్కసారిగా కుప్పకూలిన అమెరికా.. 20 ఏళ్లలో ఇదే తొలిసారి..
Diwali: ప్రభుత్వం కీలక నిర్ణయం! దీపావళి రోజు ఆ రెండు గంటలే టపాసులు కాల్చాలి!
ఉల్లి రైతులకు గుడ్ న్యూస్... అర్హులైన రైతుల ఖాతాలో నేరుగా డబ్బు జమ!!
మాస్ మహారాజా మనసులోని మాట.. ఆడకపోయినా ఆ మూడు సినిమాలంటేనే ఇష్టం!