Canada: కెనడాలో కాల్పుల కలకలం.. భారతీయ వ్యాపారవేత్త మృతి!

2026-01-15 10:00:00
Android Tips: స్లో ఇంటర్నెట్‌తో విసిగిపోతున్నారా? ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ చిన్న ట్రిక్స్ చేస్తే స్పీడ్ డబుల్!

కెనడాలోని సర్రే నగరంలో భారత సంతతికి చెందిన వ్యక్తి హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. మంగళవారం మధ్యాహ్నం పంజాబ్‌కు చెందిన వ్యాపారవేత్త బిందర్ గర్చా తన నివాసానికి సమీప ప్రాంతంలో తీవ్ర గాయాలతో పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

Digital Library: ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్… డిజిటల్ లైబ్రరీ ప్రారంభం..!!

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. అక్కడే బిందర్ గర్చా మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రాథమిక దర్యాప్తులో ఆయన బుల్లెట్ గాయాల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది.

సంక్రాంతి బరుల్లో కోడిపందాల హోరు.. ఆ జిల్లాల్లో రాజకీయ నేతల సందడి.. పందెం కోళ్లతో..

పోలీసుల వివరాల ప్రకారం, బిందర్ గర్చా గత కొన్నేళ్లుగా కెనడాలో నివసిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. అతడు ‘స్టూడియో-12’ అనే ఫొటో స్టూడియోను నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్నేహశీలి స్వభావం కలిగిన వ్యక్తిగా స్థానికుల్లో ఆయనకు మంచి పేరుందని తెలిసింది.

పవర్ స్టార్ ప్యాక్డ్ ప్లాన్.. భోగి వేళ పవన్ కల్యాణ్ కీలక భేటీ.. రెండు భారీ ప్రాజెక్టులు లైన్లో!

హత్య జరిగిన అనంతరం దుండగులు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న ఒక కాలిపోయిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనం ఘటనకు ఎలా సంబంధం కలిగి ఉందనే అంశంపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. కాల్పుల వెనుక కారణాలు, దుండగుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

నక్కపల్లిలో హోంమంత్రి భోగి సంబరాలు.. కేరళ డప్పులతో సందడి.. గోపూజతో ఆధ్యాత్మిక వేడుక!

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించే ప్రయత్నం జరుగుతోంది. ఈ హత్య వెనుక వ్యక్తిగత కారణాలా, వ్యాపార సంబంధమైన వివాదాలా అనే అంశాలను కూడా అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.

గ్రీన్ టీ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోకపోతే ప్రమాదమే! ఆరోగ్యానికి వరం.. కానీ తప్పుగా తాగితే..
మందుబాబులకు గుడ్న్యూస్.. ఆ పాలసీలో కీలక మార్పులు.. ఇక ఎక్కడ లిక్కర్ కొన్నా ఒకటే రేటు..!
NEET PG : NEET PGలో నెగటివ్ మార్కులకూ అడ్మిషన్.. కేంద్రం సంచలన నిర్ణయం!
Monsoon: ఈశాన్య రుతుపవనాల ఎగ్జిట్.. శీతాకాల చలి ఎఫెక్ట్ కొనసాగింపు!
హాలిడే ప్లాన్ చేస్తున్నారా? ఇండిగో అదిరిపోయే ఆఫర్, వారికి రూపాయికే విమానం టికెట్.! పూర్తి వివరాలు మీకోసం..

Spotlight

Read More →