Motorola : తక్కువ ధరలో హైపర్ ఫీచర్లు – ఈరోజు మార్కెట్‌లోకి వచ్చిన మోటో G67 పవర్ 5G టెక్ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది!! రూ. 30కే 100 కి.మీ మైలేజ్.. EMIలో నెలకు రూ.1,700కే ఇంటికి తెచ్చుకోండి! ధర.. ఫీచర్లు ఇవే! Apple phone: Apple phone: iOS 26.1 విడుదల – కొత్త డిజైన్, భద్రతా ఫీచర్లు, వినియోగదారుల కోసం 10 మార్పులు!! అందరినీ ఆశ్చర్యపరిచిన టాటా.. కొత్త రికార్డ్! 125సీసీలో కింగ్ వచ్చేసాడు.. మైలేజ్, ధర చూస్తే షాకే! Maruti Suzuki: మారుతికి కొత్త తలనొప్పి - ఆరు నెలల్లో.. రెండు కుటుంబాలకు సరిపోయే మారుతి ఇన్విక్టో.. TVS NTorq 125 మోడల్స్ వారీగా పూర్తి ధరల జాబితా విడుదల! సిటీ ట్రాఫిక్‌కు, లాంగ్ రైడ్‌కు బెస్ట్ ఆప్షన్! Electric Scooter Offer: రూ.95,000 విలువ గల ఈవీ ఇప్పుడు కేవలం రూ.30,950కే! మైలేజ్ లో మహారాజు... త్వరపడండి! India Aviation industry : రష్యాతో కొత్త ఒప్పందం – భారతదేశంలోనే ప్రయాణికుల విమానాల తయారీకి గ్రీన్ సిగ్నల్! బెస్ట్ మైలేజ్ బైక్.. కేవలం రూ.65 వేలకే.. ఫుల్ ట్యాంక్‌తో 700 కి.మీ మైలేజ్! AP Electronics Manufacturing ఏపీకి కేంద్రం భారీ గిఫ్ట్ – రూ.765 కోట్ల పెట్టుబడి ఎలక్ట్రానిక్స్ రంగంలో కొత్త దిశ! Motorola : తక్కువ ధరలో హైపర్ ఫీచర్లు – ఈరోజు మార్కెట్‌లోకి వచ్చిన మోటో G67 పవర్ 5G టెక్ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది!! రూ. 30కే 100 కి.మీ మైలేజ్.. EMIలో నెలకు రూ.1,700కే ఇంటికి తెచ్చుకోండి! ధర.. ఫీచర్లు ఇవే! Apple phone: Apple phone: iOS 26.1 విడుదల – కొత్త డిజైన్, భద్రతా ఫీచర్లు, వినియోగదారుల కోసం 10 మార్పులు!! అందరినీ ఆశ్చర్యపరిచిన టాటా.. కొత్త రికార్డ్! 125సీసీలో కింగ్ వచ్చేసాడు.. మైలేజ్, ధర చూస్తే షాకే! Maruti Suzuki: మారుతికి కొత్త తలనొప్పి - ఆరు నెలల్లో.. రెండు కుటుంబాలకు సరిపోయే మారుతి ఇన్విక్టో.. TVS NTorq 125 మోడల్స్ వారీగా పూర్తి ధరల జాబితా విడుదల! సిటీ ట్రాఫిక్‌కు, లాంగ్ రైడ్‌కు బెస్ట్ ఆప్షన్! Electric Scooter Offer: రూ.95,000 విలువ గల ఈవీ ఇప్పుడు కేవలం రూ.30,950కే! మైలేజ్ లో మహారాజు... త్వరపడండి! India Aviation industry : రష్యాతో కొత్త ఒప్పందం – భారతదేశంలోనే ప్రయాణికుల విమానాల తయారీకి గ్రీన్ సిగ్నల్! బెస్ట్ మైలేజ్ బైక్.. కేవలం రూ.65 వేలకే.. ఫుల్ ట్యాంక్‌తో 700 కి.మీ మైలేజ్! AP Electronics Manufacturing ఏపీకి కేంద్రం భారీ గిఫ్ట్ – రూ.765 కోట్ల పెట్టుబడి ఎలక్ట్రానిక్స్ రంగంలో కొత్త దిశ!

Maoist: బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌..! ముగ్గురు మావోయిస్టుల మృతి..!

2025-11-05 20:37:00
Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది!

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్‌ దూకుడుగా కొనసాగుతోంది. బీజాపూర్‌ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం భద్రతా బలగాలు మావోయిస్టులపై ముమ్మర కూంబింగ్‌ చేపట్టగా, ఇరువర్గాల మధ్య తీవ్ర కాల్పులు జరిగాయి. తార్లగూడ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. తెలంగాణ సరిహద్దుకు దగ్గరగా ఉండటంతో ఈ ఆపరేషన్‌ ప్రాముఖ్యత సంతరించుకుంది. పోలీసులు మృతుల వద్ద నుంచి పలు ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

జియోమార్ట్‌లో ఐఫోన్ 16 ప్లస్‌పై రూ.25,000 వరకు భారీ తగ్గింపు!

నిఘా వర్గాల సమాచారం మేరకు అన్నారం, మరిమల్ల గ్రామాల మధ్య మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు గుర్తించిన భద్రతా బలగాలు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ (STF) బృందాలతో కలిసి సంయుక్త ఆపరేషన్‌ చేపట్టాయి. కూంబింగ్‌ కొనసాగుతున్న సమయంలో మావోయిస్టులు బలగాలపై కాల్పులు జరపడంతో తక్షణమే ప్రతిదాడి ప్రారంభమైంది. గంటకు పైగా సాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ప్రాంతంలో ఇంకా కొంతమంది మావోయిస్టులు దాగి ఉన్నారనే అనుమానంతో బలగాలు సాయంత్రం వరకు ఆపరేషన్‌ కొనసాగించాయి.

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు 90% పూర్తి… సీఎం చంద్రబాబు కృషి ఫలితమని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు!

పోలీసు అధికారులు మాట్లాడుతూ — “బీజాపూర్‌లోని తార్లగూడ అడవుల్లో జరుగుతున్న ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోంది. పరిస్థితి అదుపులోనే ఉంది. హతమైన మావోయిస్టులు అంతర్రాష్ట్ర కమిటీలకు చెందినవారై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నాం. పూర్తి వివరాలను ఆపరేషన్‌ ముగిసిన తర్వాత వెల్లడిస్తాం” అని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న బలగాలకు ఎలాంటి నష్టం జరగలేదని, కీలక స్థావరాలపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.

Defense Minister: సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక!

ఇక ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించినట్లుగా — 2026 మార్చి నాటికి దేశం మొత్తం నుంచి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో భద్రతా బలగాలు యుద్ధ స్థాయిలో ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. 2024 జనవరిలో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 2,100 మంది మావోయిస్టులు లొంగిపోగా, 1,785 మందిని అరెస్ట్‌ చేశారు. వివిధ ఆపరేషన్లలో 477 మంది మావోయిస్టులు హతమయ్యారు. మరోవైపు ప్రభుత్వం ‘ఆత్మసమర్పణ్ ఏవం పునర్వాస్ నీతి 2025’, ‘నియాద్ నెల్ల నార్ యోజన’ వంటి పథకాల ద్వారా లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తూ ద్వంద్వ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ చర్యలతో మావోయిజం తగ్గుముఖం పట్టిందని అధికారులు పేర్కొంటున్నారు.

అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలక ప్రాంతం.. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు! భూముల ధరలు - ఉపాధి అవకాశాలు భారీగా!
ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు!
100 ఏళ్లు దాటడానికి రహస్యం.. ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షులో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన 6 దేశాలు!
భార్యభర్తలు 5 విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు, అవేంటో తెలుసా?
Elections: హర్యానాలో ఓటు చోరీ అంటూ సంచలనం..! ఈసీ ఘాటు కౌంటర్..!
New changes WhatsApp: ఆన్‌లైన్ బిజినెస్‌లు, సోషల్ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ – వాట్సాప్‌లో కొత్త మార్పులు!

Spotlight

Read More →