ఖతార్ తెలుగుదేశం కమిటీ! అన్నగారి వర్ధంతి కి ఘన నివాళి!

తెలుగువారి ఆత్మగౌరవం, ఆరాధ్యదైవం అన్న నందమూరి తారకరాముడి వర్ధంతి సందర్భంగా ఖతార్ తెలుగుదేశం కమిటీ ఆధ్వరంలో ఆయనకు పార్టీ శ్రేణులు ఘన  నివాళులు అర్పించారు. ఆ

Published : 2024-01-19 21:18:00

తెలుగువారి ఆత్మగౌరవం, ఆరాధ్యదైవం అన్న నందమూరి తారకరాముడి వర్ధంతి సందర్భంగా ఖతార్ తెలుగుదేశం కమిటీ ఆధ్వరంలో ఆయనకు పార్టీ శ్రేణులు ఘన  నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి శ్రద్ధాంజలి ఘటించారు. జ్యోతిపజలనతో ప్రారంభమైన కార్యక్రమం, అద్భుతమైన శ్లోకాలతో ఆయనకు ఘననివాళి అర్పించారు, ఆయన చేసిన ఎన్నోకార్యక్రమాలు నేటితరానికి వివరించే ప్రయత్నం చేసారు. ఈసందర్భంగా ఖతార్ శాఖ ఆద్యఖులు గొట్టిపాటి రమణయ్య మాట్లాడుతూ ఎన్.టి. ఆర్ అనే మూడు అక్షరాలు తెలుగువారి గుండెల్లో శాస్వితంగా నిలిచి ఉంటాయని చెప్పుకొచ్చారు, ఆయనకు నిజమైన నివాళి ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చి పేదలు, బడుగు బలహీన వర్గాల కళలను సార్ధకం చేయాలని పిలుపునిచ్చారు, సీనియర్ లీడర్ బషీరుల్లా ఖాన్ అద్భుతమైన శ్లోకాలు, పాటలు అన్న ఎన్.టి. ఆర్ గారిమీద ఆలపించారు.

ప్రధానకార్యదర్శి పొనుగుమాటి రవి మాట్లాడుతూ, మద్రాసీయులుగా పివలబడే తెలువారి కీర్తి ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత అయన సొంతమని, అటు చలనచిత్ర రంగంలోకాని,ఇటు రాజకీయ రంగంలోకానీ తనకి తానే సాటి, మరొకరులేరు ఆయనకు పోటీ అని కొనియాడారు, ఆయన నినాదం, కూడు, గూడు, గుడ్డ దేశానికి ఆదర్శముగా నిలిచాయని చెప్పుకొచ్చారు. జీసీసీ కౌన్సిల్ మెంబెర్ మల్లిరెడ్డి సత్యనారాయణ ప్రసంగిస్తూ.. అన్నగారి గురించి మాట్లాడడానికి గంటలు కాదు రోజులు కూడా సరిపోవు, అయన వంటి మహానుభావుడు తెలుగు జాతిలో జన్మించటం తెలుగువారి పూర్వజన్మ సుకృతం అని, ప్రపంచమంతటా ఆయనకు ఘననివాళులు అర్పిస్తుంటారని అయన సేవలను కొనియాడారు.

JVV సత్యనారాయణ మాట్లాడుతూ, అన్నగారి గురించి మాట్లాడుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి అయన పేరుతొలగించినందుకు ఎంతో భాధకలిగిందని, చివరకు ఆయనపేరుతోఉన్న హెల్త్ యూనివర్సిటీకి కూడా అయన పేరును తొలగించడాన్ని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని, తిరిగి ప్రజా ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే, అయన పేరును హెల్త్ యూనివర్సిటీ తోపాటు, పోలవరం ప్రాజెక్ట్ కి ఎన్.టి. ఆర్ పోలవరంగా నామకరణం చేయనాలి తెలుగుప్రజల తరుపున అభ్యర్ధించారు. యలమంచిలి శాంతయ్య మాట్లాడుతూ అన్నఎన్.టి. ఆర్ పేరుచెప్పగానే తెలుగు ప్రజలలో భక్తిభావం కలుగుతుందని, అయన మనకు భౌతికంగా దూరమైనా.. మనందరి గుండెల్లో శాస్వితంగా ఉంటారలి, అయన ఆసియాలకు అనుగుణంగా మనమంతా నడుచుకోవాలని కోరారు, రమేష్ దాసరి మాట్లాడుతూ ఎన్.టి. ఆర్ కారణజన్ముడని, అయన తెలుగుప్రజలు చేసిన సేవ ఆయనకు శాశ్విత కీర్తి తెచ్చిపెట్టినదని, ఆయనకు భారతరత్నతో గౌరవించోకోవడం మనకర్తవ్యం అని కేంద్రప్రభుత్వాలు ఇకనైనా ఆదిశగా ఆలోచించాలని ఆకాంశించారు. ఖోసాధికారి విక్రమ్ సుఖవావి ఈకార్యక్రమానికి హాజరైన ప్రతివక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు.. Dr రవీంద్రనాథ్ చిన్నూరు, బోండ్లపాటి విజయ్ కుమార్, సాయి మోహన్, యాసిన్, వేరేపల్లి అనిల్, అవినాష్ మద్దిరాల,జుబేర్ తదితరులు పాల్గొన్నారు.

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →