Mulapeta Port: శ్రీకాకుళం జిల్లాకు మణిహారం... మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన! AP Water Resources: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరే లక్ష్యం.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.! Neradu Barriage: ఏపీలో ఆ జిల్లాకు మహార్దశ! ఆ ప్రాజెక్టు తో మారనున్న రూపురేఖలు... ఎన్నో ఏళ్ల కల! Google Data Center: ఏపీ ఐటీ రంగంలో చారిత్రక ఘట్టం.. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన. Inter Results: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఫలితాలు విదుదలయ్యేది అప్పుడే! Ram Gopal Varma: చావుకు మరో ఏడాది దగ్గరయ్యాను... నెట్టింట వైరల్‌గా మారిన వర్మ పోస్ట్! Celebrity Couples: శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై నోరు విప్పిన జాన్వీ కపూర్... ఆసక్తికర వ్యాఖ్యలు! Dehydration: వేసవి తాపం నుండి రక్షణ... మీ డైట్‌లో ఇవి ఉంటే ఎండ దెబ్బకు సమస్యలుండవు! Kidney Stones Prevention: కిడ్నీలో రాళ్లు రాకూడదంటే..మీ డైట్‌లో ఈ డ్రింక్ ఉంటే రాళ్ల సమస్య మర్చిపోవచ్చు! Jammulapalem ZPP High School: జమ్ములపాలెంలో డిజిటల్ విద్యకు శ్రీకారం.. కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం..!! Mulapeta Port: శ్రీకాకుళం జిల్లాకు మణిహారం... మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన! AP Water Resources: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరే లక్ష్యం.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.! Neradu Barriage: ఏపీలో ఆ జిల్లాకు మహార్దశ! ఆ ప్రాజెక్టు తో మారనున్న రూపురేఖలు... ఎన్నో ఏళ్ల కల! Google Data Center: ఏపీ ఐటీ రంగంలో చారిత్రక ఘట్టం.. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన. Inter Results: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఫలితాలు విదుదలయ్యేది అప్పుడే! Ram Gopal Varma: చావుకు మరో ఏడాది దగ్గరయ్యాను... నెట్టింట వైరల్‌గా మారిన వర్మ పోస్ట్! Celebrity Couples: శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై నోరు విప్పిన జాన్వీ కపూర్... ఆసక్తికర వ్యాఖ్యలు! Dehydration: వేసవి తాపం నుండి రక్షణ... మీ డైట్‌లో ఇవి ఉంటే ఎండ దెబ్బకు సమస్యలుండవు! Kidney Stones Prevention: కిడ్నీలో రాళ్లు రాకూడదంటే..మీ డైట్‌లో ఈ డ్రింక్ ఉంటే రాళ్ల సమస్య మర్చిపోవచ్చు! Jammulapalem ZPP High School: జమ్ములపాలెంలో డిజిటల్ విద్యకు శ్రీకారం.. కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం..!!

Celebrity Couples: శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై నోరు విప్పిన జాన్వీ కపూర్... ఆసక్తికర వ్యాఖ్యలు!

Celebrity Couples: జాన్వీ కపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియాతో ఉన్న బంధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అతని దగ్గర తాను ఎంత సురక్షితంగా భావిస్తారో వివరిస్తూ, తన ఫ్యామిలీతో శిఖర్‌కు ఉన్న సాన్నిహిత్యం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Published : 2026-04-07 16:26:00

Celebrity Couples: బాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి  కుమార్తె జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకోవడానికి ఆమె వెనుకాడదు. గత కొంతకాలంగా జాన్వీ కపూర్, శిఖర్ పహారియాతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా ఈ జంట జంటగా కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించని జాన్వీ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టింది.

శిఖర్‌తో తనకున్న బంధం గురించి మాట్లాడుతూ.. అతని దగ్గర తాను చాలా ప్రశాంతంగా, చిన్నపిల్లలా ఉంటానని జాన్వీ చెప్పుకొచ్చింది. "ప్రేమ అనేది మనల్ని మనం సరికొత్తగా చూసుకునేలా చేస్తుంది. శిఖర్ దగ్గర ఉన్నప్పుడు నాకు చాలా భద్రతగా అనిపిస్తుంది. నా ఆలోచనలను పంచుకోవడానికి, ఒక చిన్న పాపలా అల్లరి చేయడానికి అతను నాకు ఇచ్చే వెసులుబాటు మరెక్కడా దొరకదు. నిజం చెప్పాలంటే అతనితో గడిపే సమయమే నాకు అత్యంత సంతోషకరమైనది అంటూ జాన్వీ   చెప్పుకొచ్చింది. 

శిఖర్ పహారియా కేవలం జాన్వీకే కాకుండా ఆమె కుటుంబ సభ్యులకు కూడా చాలా సన్నిహితుడని తెలుస్తోంది. గతంలో కరణ్ జోహార్ షోలో పాల్గొన్నప్పుడు కూడా జాన్వీ ఇదే విషయాన్ని ప్రస్తావించింది. తన తండ్రి బోనీ కపూర్, సోదరి ఖుషీ కపూర్‌లతో కూడా శిఖర్ మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారని, ఎటువంటి స్వార్థం లేకుండా తమ కుటుంబానికి అండగా నిలబడ్డారని ఆమె ప్రశంసించింది. ఒక మనిషి మరొకరి కోసం అంత నిస్వార్థంగా ఉండటం చాలా అరుదని, శిఖర్ ప్రవర్తన తనకు ఎంతో నచ్చిందని ఆమె పేర్కొంది.

ఇక కెరీర్ విషయానికి వస్తే, జాన్వీ కపూర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె టైగర్ ష్రాఫ్ సరసన 'లగ్ జా గలే' అనే భారీ యాక్షన్ సినిమాలో నటిస్తోంది. ముంబైలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతేకాకుండా, ఆమె నటించిన 'హోమ్ బౌండ్' సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల రేసులో నిలవడం జాన్వీ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా చెప్పవచ్చు. పెద్ది సినిమాలో కూడా త్వరలో విడుదల కానుంది తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటూనే, కమర్షియల్ హిట్లను కూడా తన ఖాతాలో వేసుకోవాలని ఆమె చూస్తోంది.

 సినిమాలతో, ఇటు వ్యక్తిగత విషయాలతో జాన్వీ కపూర్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. శిఖర్ పహారియాతో తన ప్రేమ వ్యవహారంపై ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతారా? లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టులు చూస్తుంటే, రాబోయే రోజుల్లో తెలుగు, హిందీ ప్రేక్షకులను అలరించడానికి ఆమె సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. 

Spotlight

Read More →